ఇక నో బ్యాగ్ డే

ఇక నో బ్యాగ్ డే

విజయవాడ, నిర్దేశం:
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పుస్తకాల మోతకు స్వస్తి పలికేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం ప్రతి నెల మూడో శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తుండగా… ఇకపై దీనిని ప్రతి శనివారం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం నో బ్యాగ్ డేను అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారుప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అందులో భాగంగానే ‘నో బ్యాగ్‌ డే’ అమలు చేస్తోంది. ఆ రోజు విద్యార్థులకు క్విజ్లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని లోకేశ్ తెలిపారు. నో బ్యాగ్ డే వల్ల విద్యార్థులకు కలుగుతున్న ప్రయోనాలపై వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలిపిన విశేషాలతో కూడిన వీడియోను లోకేశ్ షేర్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు సైతం అభినందిస్తున్నారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం నెలలో మూడో శనివారం నో బ్యాగ్‌ డేగా అమలు చేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల అది సరిగా అమలు కావడం లేదనే విమర్శ ఉంది.

ఈ ఏడాది జనవరిలో మంత్రి నారా లోకేష్ పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై జరిగిన సమీక్షలో పాఠశాలల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల కోసం కో కరిక్యులమ్ రూపొందించాలని కూడా మంత్రి నారా లోకేష్ అధికారులను కోరారు.విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించడం, బడి అంటే భయాన్ని పోగొట్టడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న మంత్రి నారా లోకేష్ జనవరి నెలలో కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రతి శనివారం నో బ్యాగ్ డే గా ప్రకటించి విద్యార్థులకు కో కరిక్యులం యాక్టివిటీస్ రూపొందించాలని సంబంధిత విద్యాశాఖ అధికారులను మంత్రి అప్పుడు ఆదేశించారు. ఈ ఆదేశాలు అమలైతే ప్రతి శనివారం విద్యార్థులు పాఠశాలకు పుస్తకాల బరువులతో వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఉన్నత పాఠశాల స్థాయి చదువుల కోసం విద్యార్థులు పుస్తకాల రూపంలో అధిక బరువులను మోస్తున్న పరిస్థితి. వారంలో ఆరు రోజులు విద్యార్థులకు ఏకధాటిగా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం రోజు సెలవు దినం కావడంతో, ఆరోజున విద్యార్థులు తమకు అప్పగించిన హోంవర్క్ పూర్తి చేసే పనిలో ఉంటారని చెప్పవచ్చు. అలాగే తమకు దొరికిన కొద్ది సమయంలో ఆటపాటలకు సమయాన్ని కేటాయిస్తారు. ఇటువంటి పరిస్థితులను అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »