దేశంలో దుర్మార్గంగా మహిళలపై దాడులు.. బెంగాల్ ఏ స్థానంలో ఉందంటే?

నిర్దేశం, న్యూఢిల్లీ: భారతదేశంలో మహిళలపై నేరాలు ఒక తీవ్రమైన సమస్య. మహిళలపై నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు చేసినప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు మాత్రం నానాటికీ పెరిగిపోతున్నాయి. గృహ హింస, లైంగిక వేధింపులు, వరకట్న సంబంధిత నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి అనేక రకాల నేరాలు మహిళలపై జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక తెలియజేస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం, 2022లో ప్రతి గంటకు 51 మహిళలపై క్రిమినల్ దాడులు జరుగుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయి. మహిళలపై మొత్తంగా 2022లో 4,45,256 కేసులు నమోదయ్యాయి. 2021లో 4,28,278 కేసులు, 2020లో 3,71,503 కేసులు నమోదయ్యాయి.

ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి?
మహిళలపై జరిగే నేరాల్లో అత్యధికంగా భర్తలు, బంధువులు లేదా తెలిసిన వారి వల్లే జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 31.4 శాతం. తదుపరి అత్యంత సాధారణ నేరం మహిళల కిడ్నాప్, ఇది మొత్తం కేసులలో 19.2 శాతం. మానసిక వేధనకు సంబంధించిన దాడుల సంఖ్య 18.7 శాతం. ఇక అత్యాచారం మొత్తం కేసులలో 7.1 శాతం.

మహిళలపై లైంగిక హింస కేసులు
మహిళలపై లైంగిక హింస కేసులు 2016లో గరిష్ట స్థాయి 39,000కి చేరుకున్నాయి. 2018లో దేశవ్యాప్తంగా సగటున ప్రతి 15 నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురైంది. 2018 నుంచి భారతదేశంలో ప్రతి సంవత్సరం 400 కంటే ఎక్కువ లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 86 మైనర్ రేప్ కేసులు, 68 మహిళలను మానసిక వేధనకు సంబంధించి కేసులు ఉన్నాయి.

ఏయే రాష్ట్రాలు ముందున్నాయి?
మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్యను పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. 2022లో అత్యధికంగా 65,743 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్‌లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 45 వేల కేసులు నమోదయ్యాయి. 2022లో 34,738 కేసులతో పశ్చిమ బెంగాల్ నాల్గవ స్థానంలో ఉంది. అయితే, బెంగాల్‌లో ఈ నేరాల సంఖ్య గత రెండేళ్లతో పోలిస్తే తగ్గింది. 2020లో ఇక్కడ 36,439 కేసులు నమోదు కాగా, 2021లో 35,884 కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీ, యూపీ మొదటి స్థానం
మహిళల నేరాల రేటును పరిశీలిస్తే.. రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. 2022లో ఢిల్లీలో నేరాల రేటు లక్ష జనాభాకు 144.4 ఉండగా, 14,247 కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత హర్యానా (118.7), తెలంగాణ (117), రాజస్థాన్ (115.1), ఒడిశా (103.3)లో ఉన్నాయి. 62 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ (41), మహారాష్ట్ర (22), అస్సాం (14), ఒడిశా (14), గుజరాత్‌ (12), రాజస్థాన్‌ (9), ఆంధ్రప్రదేశ్‌ (8), కర్నాటకలో (8) ఇలాంటి దారుణమైన నేరాలు అత్యధికంగా జరిగాయి.

అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు
2022లో మొత్తం 248 గ్యాంగ్‌రేప్, హత్య కేసులు నమోదయ్యాయి. ఈ దాడుల్లో మొత్తం 250 మంది మహిళలు బాధితులు అయ్యారు. సిక్కిం, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఇది కాకుండా గోవా, మేఘాలయ, ఉత్తరాఖండ్‌లలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం 2022లో మొత్తం 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో అత్యధికంగా 5399 కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత ఉత్తరప్రదేశ్ (3690), మధ్యప్రదేశ్ (3029), మహారాష్ట్ర (2904), హర్యానా (1787), ఒడిశా (1464), జార్ఖండ్ (1298), ఛత్తీస్‌గఢ్ (1246), ఢిల్లీ (1212), అస్సాం (1113) అత్యాచార కేసులు నమోదయ్యాయి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »