వెబ్ సీరీస్ పై స్పందించిన సినీ హీరో శివకృష్ణ

వెబ్ సీరీస్ పై స్పందించిన సినీ హీరో శివకృష్ణ

హైదరాబాద్, మార్చి 17 : ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లలో బూతులు .. అభ్యంతరకరమైన సన్నివేశాలు ఎక్కువవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సీనియర్ నటుడు శివకృష్ణ స్పందించారు. “నేను సెన్సార్ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడే ఈ తరహా అంశాలపై దృష్టి పెట్టాను. ట్రైలర్స్ మొదలు అనువాద సినిమాల వరకూ సెన్సార్ జరుపుకునేలా చూడాలని లెటర్ కూడా పెట్టాను” అన్నారు.

“సినిమాల్లో బూతు ఉంటే, థియేటర్స్ కి వచ్చిన వారికి మాత్రమే ఆ సంగతి తెలుస్తుంది. వెబ్ సిరీస్ లు అలా కాదే. ఇలాంటివి చూడకుండా పిల్లలను నియంత్రిచడం కష్టమైపోతోంది. ఈ మధ్య కాలంలో చాలామంది పాడైపోవడానికి కారణం ఓటీటీ సినిమాల వల్లనే .. వెబ్ సిరీస్ ల వల్లనే. అందువలన కచ్చితంగా వాటికి సెన్సార్ ఉండాల్సిందే” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

“నిన్న నేను ఆ వెబ్ సిరీస్ చూడలేకపోయాను .. సడెన్ గా అలాంటి ఒక సీన్ వస్తుందని మనం ఊహించలేం కదా. అంత దారుణాన్ని ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. మనం ఎక్కడికి వెళ్లిపోతున్నాం అనిపించింది. దేశం ఆర్ధికంగా పతనమైన తిరిగి కోలుకుంటుంది. కానీ సంస్కృతి పరంగా పతనమైతే ఆ దేశాన్ని కాపాడం కష్టం” అని చెప్పుకొచ్చారు.

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!