రోడ్డు ప్రమాదం లో తల్లికూతుర్లు మృతి
గుంటూరు, నిర్దేశం:
గుంటూరు నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కూతురు మృతి చెందారు. గుంటూరు గోరంట్ల చిల్లిస్ రెస్ట్రారెంట్ వద్ద ఘటన జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న వాహనాన్నిలారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో సంఘటన స్థలంలోనే తల్లి కూతురు చెందారు. నల్లపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులు వింజమూరు నాగలక్ష్మి (38), కుమార్తె చరణ్య (14) గుంటూరు అడవి తక్కేలా పాడు టిడ్కో అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నట్లు గుర్తుంచారు. మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.