ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం నాదే  అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం నాదే  అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

– ఓటమి మరింత బాధ్యతను పెంచింది
– కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అధైర్య పడొద్దు

– కరీంనగర్ కాంగ్రెస్ కు నాయకత్వ లోపం పార్టీ పటిష్టతకు కృషి చేస్తా..
– కాంగ్రెస్ పార్టీలో లోటుపాట్లపై పార్టీ పెద్దలకు నివేదిక ఇస్తాను
– పార్టీ తనకు ఏభాద్యత  అప్పగించిన బాధ్యతతో నిర్వహిస్తా..
– రానున్న రోజుల్లో .ప్రత్యక్ష రాజకీయాల్లోనే కొనసాగుతా

మీడియా సమావేశంలో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్,  నిర్దేశం:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టెక్నికల్ గా తాను ఓడిపోయినప్పటికీ నైతిక విజయం మాత్రం తనదేనని పట్టబద్రులంతా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెల్లడించారు.. గురువారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు…

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తనకు మరింత బాధ్యతను పెంచిందని రానున్న రోజుల్లో కాంగ్రెస్  వాదిగా పార్టీలో మరింత చురుకుగా పని చేస్తానని.. పార్టీ పటిష్టతకు అధిష్టానం తనకు ఏ బాధ్యత ఇచ్చిన నిర్వహిస్తానని వెల్లడించారు.. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతుందని… పార్టీ ప్రక్షాళనకు  తనవంతుగా కృషి చేస్తానని వెల్లడించారు..రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసికట్టుగా పని చేసేలా కృషి చేస్తానన్నారు..చెల్లుబాటు కానీ ఓట్లు 11శాతం 28686 ఓట్లు తన ఓటమికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.. చెల్లుబాటు కానీ  పదివేల ఓట్లు తనకు వచ్చేవేనని వెల్లడించారు.. ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా చేసిన విష ప్రచారాన్ని పట్టభద్రులు పట్టించుకోలేదని   ఓటర్లు మాత్రం తనకు మద్దతు పలికారని వెల్లడించారు. టెక్నికల్ గా తాను ఓటమిపాలైనా నైతికంగా  తానే విజయం సాధించానని వెల్లడించారు..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకోసం కష్టపడి పనిచేసిన  కాంగ్రెస్ శ్రేణులకు, అల్ఫోర్స్ కుటుంబ సభ్యులకు సిపిఐ సిపిఎం టీజేఎస్ వివిధ కుల సంఘాల నాయకులకు మరియు ప్రత్యేకంగాధన్యవాదములు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తనకు అండగా నిలిచిన మంథనిvశాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రివర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..ఎన్నికలకు ముందు 42 నియోజకవర్గాల్లో పట్టభద్రులకు ఇచ్చిన హామీల అమలుకు రేపటి నుంచే నా కార్యాచరణ ఉంటుందని .అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానని తెలిపారు..చొప్పదండి వేములవాడ,సిరిసిల్ల లో కాస్త వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు..చెల్లుబాటు కానీ ఓట్లపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని..50 శాతం ప్లస్ వన్ ఓటు రాకపోయినా విజేతనుఎలా ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు..కాంగ్రెస్ పార్టీలో లోటుపాట్లపై పార్టీ పెద్దలకు నివేదిక ఇస్తానని పార్టీలో స్తబ్దత నెలకొందని పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచేందుకు కృషి చేస్తానని పునరుద్ఘాటించారు…

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »