ఐరన్ స్క్రాప్ తో మోడీ విగ్రహం
విజయవాడ, నిర్దేశం:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రభాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. మే 2న పునర్నిర్మాణ పనులకు మోదీ శంఖుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని సభ వేదిక వద్దకు వెళ్లే సమయంలో ఆయన ప్రత్యేక విగ్రహాన్ని తిలికించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆటో మొబైల్ స్క్రాప్‌తో చేసిన మోదీ విగ్రహంతో పాటు వెలకమ్ అమరావతి లెటర్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఒక స్టాండ్ ఏర్పాటు చేశారు.తెనాలికి చెందిన సూర్య శిల్ప శాల శిల్పులు కాటూరి వెంకటేశ్వరావు ఆయన తనయులు రవిచంద్ర, సూర్య కుమార్ మోడ్రన్ ఆర్ట్ లో నిష్ణాతులు. ఇప్పటికే ఎన్నో రకాల విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఐరన్ స్క్రాప్ తో తయారు చేసిన మోడీ విగ్రహం కూడా ఉంది. ఆటో మొబైల్ రంగంలో ఉపయోగించే నట్టులు, బొల్టుల సాయంతో ఎత్తైన విగ్రహాలు తయారు చేశారు. ప్రముఖుల విగ్రహాలతో పాటు బైసన్, జీపు, సింహం, సైకిల్ వంటి వస్తువులను స్క్రాప్ తో తయారు చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ అమరావతి వస్తున్న సందర్భంగా లక్షలు ఖర్చు చేసి అనేక విగ్రహాలను తయారు చేశామని వాటిన సభ వద్ద ప్రదర్శనగా ఉంచేందుకు అనుమతి తీసుకున్నట్లు వెంకటేశ్వరావు తెలిపారు.సభ వద్ద మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్దుడు, సింహం, సైకిల్ తో పాటు తెలుగు దేశం పార్టీ సింబల్ ను కూడా ఐరన్ స్క్రాప్ తోనే తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. వీటితో పాటు అమరావతి పేరును కూడా తీగతో ఆకట్టుకునేలా రూపొందించారు. వీటన్నింటిని సభకు వచ్చే ప్రముఖులతో పాటు ఇతరులు తిలకించాలనేది తమ కోరిక అని శిల్పి రవిచంద్ర తెలిపారు. తెనాలి ప్రాంతం శిల్పకళకు పెట్టిందిపేరని గతంలోనూ అనేక అవార్డులు పొందినట్లు శిల్పులు తెలిపారు. మోడీ తో పాటు ఇతరలు విగ్రహాలను ఆకట్టుకునేలా రూపొందించిన శిల్పులను పలువురు అభినందిస్తున్నారు.