దేవుడి కోసం ఈసీ అనుమతి కోరిన మంత్రి..
– నో అని చెప్పిన ఈసీ..
– మళ్లీ లేఖ రాసిన మంత్రి
నిర్దేశం, భద్రాచలం : దేవుడిని ప్రత్యక్షంగా న్యూస్ ఛానల్స్ లలో చూపించడానికి అనుమతి కావాలని ప్రభుత్వం ఈసీ అధికారులకు లేఖ రాశారు. అయినా ఎలక్షన్ జరుగుతున్నందున భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరించింది. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి కోరుతూ మరోసారి సీఈఓ కు లేఖ రాసారు మంత్రి కొండా సురేఖ. ఆలయ విశిష్టత, సంప్రదాయాలు వివరిస్తూ ఆ లేఖలో పేర్కొన్నారు. 40 ఏళ్లుగా కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న విషయాన్ని ఆమె ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 17వ తేదీన శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణంను లక్షలాది మంది భక్తులు న్యూస్ ఛానల్స్ లలో ప్రత్యక్షంగా చూస్తారని పేర్కొన్నారు.