మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువు
ప్రదీప్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు
నిర్దేశం, హైదరాబాద్:
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీప బంధువు ప్రదీప్ రెడ్డి ఇంటిపై, అతని ఆఫీస్ పై సోమవారం ఐటీ అధికారులు దాడులు చేశారు. మంత్రి సబితా కుమారుడు కార్తీక్ రెడ్డి బినామిగా అనుమానించిన ప్రదీప్ రెడ్డి ఇంటిపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. కార్తీక్ రెడ్డి కి సంబంధించిన రియల్ ఎస్టెట్ వ్యాపారం అంతా ప్రదీప్ రెడ్డి నిర్వహిస్తారు. ఈ ఐటీ దాడులతో మొదటి సారి తెర పైకి ప్రదీప్ రెడ్డి పేరు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ లకు డబ్బులు సమకూర్చుతున్నరనే ఐటీ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
పోలీసు ఉన్నతాధికారి సహాకారంతో..
ఎకరం భూమి ధర కోట్ల రూపాయలు ఉన్న నార్సింగ్, బేగంపేట్ ప్రాంతాలలో పోలీసు ఉన్నతాధికారి సహాకారంతో ప్రదీప్ రెడ్డి భూదాంద చేస్తున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. నెల రోజుల్లోనే గుట్టల బేగంపేట్, నార్సింగ్ లో భూముల పై కన్ను వేసినట్లు ఐటీ అధికారులకు సమాచారం ఉంది. సాహితీ యజమాన్యంతో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్స్. కొంగర్ కలాన్ కబ్జాలో ప్రదీప్ దే కీలక రోల్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.