సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని
ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు
నిర్దేశం, సిద్దిపేట : దుబ్బాక పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద స్వర్గీయ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు సోమవారం ఆవిష్కరించారు. హరీశ్ రావు మాట్లాడుతూ రామలింగారెడ్డి విగ్రహం నా చేతుల మీదుగా ఆవిష్కరిస్తానని ఊహించలేదు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. రామలింగారెడ్డి అంటే వైవిద్యాల సమ్మేళనం అని, వామపక్ష భావజాలం, జర్నలిస్టుల సంక్షేమం కోసం, గన్నుతో, పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తి అన్నారు ఆయన. అందరి కంటే భిన్నంగా ఉండేవారు రామలింగారెడ్డి ఆత్మ శాంతి చేకూరాలంటే దుబ్బాక గడ్డమీద గులాబీ జెండా ఎగరాలి. ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంతో తెలంగాణ ఉద్యమంలో జోడెడ్లుగా రామలింగారెడ్డి నేను కలిసి పని చేశాం.
మానుకోట, మనోహరాబాద్ రైల్వే రోకో, హైదరాబాదు ఇందిరా పార్కుల వద్ద ధర్నా, రాస్తారోకో, నిరసనలు 48 గంటలు నిద్రాహారాలు మానుకుని చేసిన జ్ఞాపకాలను గుర్తు చేశారు. తన ఆరోగ్యం లెక్క చేయకుండా పని చేసి ప్రాణాలు లింగన్న కోల్పోయారు. రామలింగారెడ్డి శంకుస్థాపన చేసిన పనులకే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రిబ్బన్ కట్ చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ గెలిచాక మూడేళ్లలో చేసిందేమీ లేదు.
కానీ, చీరలు, సారెలు ఇస్తుండట. బీజేపీ రఘునందన్ రావు అరచేతిలో వైకుంఠం చూపెడతానని చెప్పిన మాయ మాటలు నమ్మి సోలిపేట సుజాత అక్కకు అన్యాయం చేశారు. బీజేపీ రఘునందన్ అరచేతిలో వైకుంఠం చూపితే దుబ్బాక ప్రజలుగా నమ్మి మోసపోయాం. తెలంగాణలో బీజేపీ లేచేది లేదు. కాంగ్రెస్ గెలిచేది లేదు. ఎన్ని ట్రిక్కులు కొట్టినా.. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కొట్టేది. ఈ ఎన్నికల్లో మాయ మాటలు నమ్మి మోసపోవద్దు . సోలిపేట కుటుంబానికి అండగా ఉంటా.. రాజకీయంగా నిలబెడతానని అన్నారు.