మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమం ప్రారంభం
-ఎలాంటి సమస్యలున్నా వాట్సప్ చేయండి
– సంప్రదించవలసిన వాట్సప్ నెంబర్ 8712659973
– ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
నిర్దేశం, అదిలాబాద్ః
సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ ఫోన్ వినియోగం యువత చేతుల్లోకి మరింత అందుబాటులోకి రావడం వల్ల, జిల్లా అధికారులను సులువుగా సంప్రదించాలని వినుత్త ఆలోచనతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు మరింత చేరువ కావాలని ఉద్దేశంతో మెసేజ్ యువర్ ఎస్పి పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. శాంతి భద్రతల పరిరక్షణ నే ధ్యేయంగా, జిల్లా ప్రజలకు మరింత వేగవంతమైన పారదర్శకమైన సేవలను అందించాలని ఈ మెసేజ్ యువర్ ఎస్పి. కార్యక్రమం. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు, సుదూర ప్రాంతాలలో ఉన్న ప్రజలు, ఎలాంటి సమస్యలున్న, ఎలాంటి సమాచారాన్ని అందించాలన్న జిల్లా ఎస్పీ నేరుగా సమాచారాన్ని అందించవచ్చు. సమాచారాన్ని అందించవలసిన పద్ధతి మీ వాట్సాప్ ద్వారా జిల్లా పోలీసు వాట్సప్ నంబర్ 8712659973 కు సంప్రదించాలని తెలియజేశారు. సమస్యల పై పూర్తి వివరాలను రాసి వాట్సాప్ ద్వారా తెలియజేయాలన్నారు. లేదా జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన సంఘవిద్రోహ కార్యకలాపాలు నిర్వహించిన సమాచారం మీకు అందించాలనిపిస్తే ఈ నెంబర్ కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని సూచించారు. వేగవంతమైన పరిష్కారాల కోసం ఈ వాట్సాప్ సేవలు తన పర్యవేక్షణలోనే ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.