కియా పరిశ్రమలో భారీ చోరి
అనంతపురం, నిర్దేశం
కియా పరిశ్రమలో భారీ చోరీ జరిగింది. శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండలోని కియా కార్ల పరిశ్రమలో ఏకంగా 900 ఇంజిన్లు మాయం కావడం కలకలం రేపుతోంది. ఇంజన్లు కనిపించడం లేదంటూ కియా యాజమాన్యం మార్చి 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదట కంప్లైంటు లేకుండానే దర్యాప్తు చేపట్టాలని కియా యాజమాన్యం కోరగా అందుకు పోలీసులు నిరాకరించారు. ఫిర్యాదు ఇస్తేనే అధికారికంగా దాటియాతో చేపట్టి నిందితులను అరెస్ట్ చేయడానికి వేలు ఉంటుందని పోలీసులు సూచించారు.. తర్వాత కియా ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద విషయం ఇన్ని రోజులు బయటకు రాకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. చిన్న విడి భాగాలు చోరీ అయితేనే సాధ్యమైనంత త్వరగా కంపెనీలు ఫిర్యాదులు చేయడం, పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేయడం జరుగుతుంటాయి. కానీ కియా ఫ్యాక్టరీ నుంచి ఏకంగా 900 ఇంజిన్లు మాయం అయితే చాలా ఆలస్యంగా విషయం వెలుగు చూసింది. సాధారణంగా అన్ని కంపెనీల తరహాలోనే కియా ఇండస్ట్రీకి సైతం విడిభాగాలు ఒక్కొచోటి నుంచి పెనుగొండలోని పరిశ్రమకు వస్తుంటాయి. కార్ ఇంజన్లు మాత్రం తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడికి వస్తాయి. అయితే మార్గమధ్యంలో చోరీ జరిగిందా, లేక క్యా పరిశ్రమనుంచే కార్ ఇంజన్లో దొంగలించారా అని అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే కేసు విచారణ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. కార్ ఇంజన్ల చోరీ కేసుకు సంబంధించి పోలీసుల త్వరలోనే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.