నిర్దేశం, క్రైం: నీట్ పేపర్ లీక్ కేసు వివాదం కొనసాగుతోంది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు గంగాధర్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు మంగళవారం కస్టడీలోకి తీసుకున్నారు. గంగాధర్ భార్య ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 25న ఉదయం 9.30 గంటలకు భర్తను అదుపులోకి తీసుకున్నారని, దీని తర్వాత తాను అతనితో మాట్లాడలేకపోయానని చెప్పారు. తన భర్త ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని చెప్పారు. అతడు హీరో కంపెనీలో వర్కర్‌గా పనిచేస్తున్నాడు.
గంగాధర్ గుండె అనే ఈ వ్యక్తి బీహార్‌కు చెందిన కొందరితో సంప్రదింపులు జరిపి పేపర్ లీక్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మే 5న నిర్వహించిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-యూజీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అప్పటి నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ కేసులో ఇద్దరు నిందితులు బల్దేవ్ కుమార్ అలియాస్ చింటూ, ముఖేష్ కుమార్‌లను బీహార్‌లోని పాట్నా కోర్టు సీబీఐ కస్టడీకి పంపింది.