ఆఫ్రికా ఐలాండ్ లో లలిత్ మోడీ

ఆఫ్రికా ఐలాండ్ లో లలిత్ మోడీ

ముంబై, నిర్దేశం:
లలిత్ మోడీ విభిన్నమైన వ్యక్తి. వ్యాపార కిటుకులు తెలిసిన వ్యక్తి. పైగా క్రికెట్ కు కార్పొరేట్ రంగులు అద్దిన వ్యక్తి. అందువల్లే ఐపిఎల్ అనేది ఏర్పడింది. ఇంతలా అభివృద్ధి చెందింది. మంచి వెనుక చెడు ఉన్నట్టు.. ఐపీఎల్ ను మానస పుత్రిక లాగా అభివర్ణించుకున్న లలిత్ మోడీ.. ఆ తర్వాత దారి తప్పాడు. ఆర్థికంగా అవకతవకలకు పాల్పడ్డాడు. ఫలితంగా ఆర్థిక నేరగాడిగా ముద్రపడ్డాడు. చివరికి దేశం విడిచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం విదేశాలలో తల దాచుకుంటున్నాడు. అతడిని ఇండియాకి తీసుకురావడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ.. విఫలమవుతూనే ఉన్నాయి.. లలిత్ మోడీ కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లాండ్ లో ఉంటున్నాడు. ఆ మధ్య అతడు సుస్మితాసేన్ తో కలిసి ఉంటున్నట్టు ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా లలిత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.చాలా సంవత్సరాలుగా ఇంగ్లాండ్ లో ఉంటున్న లలిత్.. తనను ఎప్పుడైనా సరే భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకెళ్లి ఇబ్బంది పడుతుందని భావించి.. ఇంగ్లాండ్ నుంచి కూడా లలిత్ వెళ్లిపోయాడు. ఏకంగా “వనువాటు” అనే దేశం పౌరసత్వం తీసుకున్నాడు. వనువాటు అనేది 80 ద్వీపాల సమూహం. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఇక్కడ ఆదాయపు పన్ను.. ఇతర టాక్స్ లు ఉండవు. ఈ ప్రాంతం క్రిప్టో కరెన్సీకి స్వర్గధామం గా ఉంది. 2024 లో హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్ లో ఈ దేశం తొలి స్థానంలో ఉంది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్.. స్వదేశంలో దర్యాప్తును తప్పించుకోవడానికి వను వాటు వెళ్లినట్టు తెలుస్తోంది.. లలిత్ మొదట్లో ఐపిఎల్ వ్యవహారాలను సక్రమంగానే నిర్వహించినప్పటికీ.. ఆ తర్వాత దారి తప్పాడు. ఆర్థికంగా అవకతవకలకు పాల్పడ్డాడు. చివరికి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కొద్దిరోజులుగా ఇంగ్లాండ్లో తల దాచుకున్నాడు. ఇప్పుడు ఏకంగా వనువాటు వెళ్లిపోయాడు. అయితే ఆ దేశం పౌరసత్వం తీసుకోవడానికి లలిత్ ఎంత స్థాయిలో నగదు చెల్లించాడు అనేది బయటికి తెలియ రాలేదు. లలిత్ మోడీ ఐపీఎల్ ను అభివృద్ధి చేసింది నిజమే అయినప్పటికీ.. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని అతనిపై అభియోగాలు ఉన్నాయి. 2010 నుంచి అతడు ఇంగ్లాండ్ లో తల దాచుకుంటున్నాడు. అయితే ఇప్పుడు అతడు వేరే దేశం పౌరసత్వం తీసుకున్నాడు. దీంతో అతడు భారతదేశానికి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే అతడు పౌరసత్వం తీసుకున్న దేశంలో ఉన్న నిబంధనలే దానికి కారణమని తెలుస్తోంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »