Take a fresh look at your lifestyle.

కేకే తనయులకు అప్పనంగా రూ. కోట్ల భూ పంపిణీ

0 21

నగరం నడిబొడ్డున రూ. 350 గజం

కేకే తనయులకు అప్పనంగా రూ. కోట్ల భూ పంపిణీ

నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కి 425 గజాలు

కొడుకు వెంకటేశ్వరరావుకు 1161 గజాల భూమి

పక్కదారి పట్టిన జీవో నెంబర్ 56

కబ్జాలో ఉన్న భూమికి గుత్తాధిపత్యం ఇచ్చిన తెలంగాణ సర్కార్

(కొండం అశోక్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్)

హైదరాబాదు నగరంలో పేదలకు తలదాచుకునే చిన్న గుడిసె వేసుకోవడానికి కూడా ప్రభుత్వ స్థలం ఇవ్వని తెలంగాణ సర్కార్, నేడు ఆ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీల నేతలకు రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అప్పగించింది.. రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరుతో వచ్చిన జీవో 56తో అప్పనంగా కట్టబెడుతున్నారు..

ప్రభుత్వంలోని పెద్దలు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు …కోటిశ్వర్లకు కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే వాటిని అప్పనంగా కట్టబెట్టవచ్చు ..పైగా , ఆ భూమి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో అత్యంత విలువైనదిగా ఉన్నప్పటికీ దాని పేదలను నివసించే “స్లమ్” పేరు చెప్పి ధారా దత్తం చేయడం పాలకులకు చిటికెలో పని… తిమ్మిని బమ్మి చేసి రూ. కోట్ల విలువ చేసే భూములను అతి సామాన్యమైన వ్యక్తులకు కేటాయించినట్లుగా, ఈ భూములను పెద్దలకు కట్టబెట్టడం అత్యంత దారుణం.. ఈ కబ్జా పూర్తి వివరాలకు వెళితే ఆశ్చర్యకరమైన విషయాల వెలుగులోకి వచ్చాయి..

హైదరాబాద్ నగర మేయర్ కు రూ. 350కే గజం:

హైదరాబాద్ మహానగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కి బంజారాహిల్స్ లోని ఎన్ బి టి నగర్ లో రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా 425 గజాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది… బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎన్బిటి నగర్ లోని సర్వే నంబర్ 129, 403 లలో గద్వాల విజయలక్ష్మి 1992 నుంచి ఆ స్థలాన్ని ఆక్రమించుకొని ఉంటున్నట్లు పేర్కొంది… అప్పటినుంచి ఈ స్థలానికి సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ కూడా చెల్లిస్తున్నట్లు, అలాగే నల్లా బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా చెల్లించినట్లుగా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు.

దీనికిగాను రాష్ట్ర ప్రభుత్వం 12 .6 .2023 న, సదరు భూమిపై పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తూ దారా దత్తం చేసింది… మేయర్ విజయలక్ష్మి కబ్జా చేసుకుని నివాసం ఉంటున్న స్థలానికి 1992 లో ఉన్న భూ విలువ ప్రకారం 9. 6 . 2023. న, రూ.1, 48, 750 ప్రభుత్వ ఖజానాకు చెల్లించి జీవో నెంబర్ 56 ప్రకారం గా సదరు భూమిని ప్రభుత్వం నుంచి రెగ్యులర్ చేసుకొని దర్జాగా అనుభవంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ 425 గజాలకు సంబంధించి ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం అక్కడ ఒక్కో గజానికి మూడు లక్షల రూపాయల వరకు ధర పలుకుతుంది… అయితే, నగర మేయర్ కాబట్టి, ఆమె ను అత్యంత పేదరాలుగా గుర్తించి, 1992 నాటి ప్రభుత్వ రేటును ఒక్కోగజానికి రూ. 350 చొప్పున లెక్కగట్టి జూన్ నెలలో ప్రభుత్వానికి రూ. 1,48,750 ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది.. దీంతో ఆగమేఘాల మీద విజయలక్ష్మి కి బంజారా హిల్స్ ఎన్ బిటీ నగర్ లో 425 గజాల స్థలాన్ని ప్రభుత్వం నజరానగా అందించింది..

కేకే కొడుకు కు 1116 గజాలు:

(రాజ్యసభ) ఎంపీ కే .కేశవరావు కొడుకు కే. వెంకటేశ్వర్ రావుకు అదే ఎన్ బి టి నగర్ లోని సర్వేనెంబర్ 129/1, 140 లలో 1161 గజాల స్థలాన్ని కేవలం రూ 29 లక్షల కే కట్టబెట్టింది.. ఇతను కూడా 1996 నుంచి ఈ స్థలాన్ని ఆక్రమించుకొని , నివాసముంటున్నట్లు, దీనికిగా ను ప్రాపర్టీ టాక్స్ చెల్లిస్తున్నట్లు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు.. అది ఎప్పుడో కాదు 23 మే 2023 రోజున మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ , చైర్మన్ ఆఫ్ సబ్ కమిటీకి ఆర్జీ పెట్టుకోవాలని వెనువెంటనే ఫైలు కదిలిపోయింది వెంకటేశ్వరరావుకు 1996 నాటి రేటు ప్రకారం ఒక్కోగజానికి 2500 చొప్పున లెక్కగట్టి రూపాయలు 29 దారా దత్తం చేసింది ప్రస్తుతం ఈ 1161 గజాల స్థలం రేటు దాదాపు రూ. 45 కోట్ల వరకు పలుకుతోంది ఇతను కూడా అతి పేద కడుదయనీయమైన పరిస్థితిలో మురికివాడల్లో నివాసం ఏర్పరుచుకోవడం వల్ల ప్రభుత్వం దయచూపి ఈ స్థలాన్ని అతి తక్కువ ధరకు తేదీ 12 .6. 2023 న, కట్టబెట్టినట్లుగా ప్రభుత్వం జారీ చేసిన “డీడ్ ఆఫ్ కన్వియన్స్ ” ప్రకారం తెలుస్తోంది..

ఇలా, రాష్ట్ర ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉన్న నేతలందరికీ కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెట్టడం చూస్తుంటే పాలన ఎవరికోసమో అర్థం చేసుకోవచ్చు … నగరంలో నిలువ నీడలేని పేద ప్రజల కోసం కనీస గూడును కల్పించలేని ప్రభుత్వం, ఇలా బడా నాయకులకు ప్రభుత్వ భూములను దోచిపెడుతుండడం అత్యంత బాధాకరం..

Leave A Reply

Your email address will not be published.

Breaking