కశ్మీర్.. భూతల స్వర్గం
ఫిదా అయిన బ్రిటీష్ జర్నలిస్ట్
ఢిల్లీ, మే 21 : జీ20 సమావేశాల కోసం ఇండియాకు వచ్చిన బ్రిటీష్ అరబ్ జర్నలిస్ట్ అంజాద్ తాహా.. కశ్మీర్ అందాలకు ఫిదా అయ్యారు. కశ్మీర్ ‘భూతల స్వర్గం’ అని కొనియాడారు. ‘ఇది స్విట్జర్లాండ్ లేదా ఆస్ట్రియా కాదు. ఇది జీ20 సదస్సు జరిగే కశ్మీర్. ఇక్కడ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు.. ఇలా అన్ని మతాల వారు శాంతియుతంగా జీవిస్తున్నారు’ అని ఓ వీడియో షేర్ చేశారు.