Take a fresh look at your lifestyle.

గ్యారంటీ లేని జర్నలిస్టుల బతుకులు

0 22

గ్యారంటీ లేని జర్నలిస్టుల బతుకులు
– పెంపుడు కుక్కల్లా వార్త కథనాలు..
– అడ్రసు లేకుండా పోయిన నైతిక విలువలు..
– నిజాయితీగా వార్తలు రాద్దామంటే నో జాబ్..
– అసెంబ్లీ ఎన్నికలలో యాడ్స్ టార్గెట్..
– సోషల్ మీడియా రంగ ప్రవేశంతో..

రిపోర్టర్.. జర్నలిస్ట్.. స్ట్రింగర్.. కరస్పాండెంట్ పేరులు వేరైనా వీళ్లంతా జర్నలిస్టులే.. కుళ్లిన సమాజంలో అవినీతిని కలం అనే ఆయుదంతో వార్త కథనాల రాసి ప్రజాకోర్టులో నిలబెట్టేవారే.. కానీ.. మీడియా రంగం అంతా బిజినెస్ గా మారింది. పొలిటికల్ లీడరులు మీడియా రంగంలోకి ప్రవేశించడంతో వారి స్వార్థం చూసుకుంటున్నారు. యాడ్స్ పేరిట కోట్ల రూపాయలు తీసుకుని ఏదో పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కథనాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితిలో జర్నలిస్ట్ ఏకపక్ష కథనాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.

జర్నలిస్ట్.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ కాలం వెళ్లతీసే వారే. సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలను వెలికి తీసి సమాజానికి ఏదో చేయాలని నిర్ణయించుకుని జర్నలిజం వృత్తిలోకి వచ్చే వారే ఎక్కువ. జర్నలిజం కోర్సులో థిరీ చదివిన వీళ్లకు ప్రాక్టికల్ గా యజమాన్యంతో ఎదురయ్యే సమస్యలను సవాల్ చేయలేక పోతున్నారు. కోట్లు పెట్టుబడులు పెట్టిన యజమాన్యం తాము చెప్పిందే వేదంగా వార్త కథనాలు రాయించుకుని తమ బిజినెస్ లేదా పొలిటికల్ డెవలప్ మెంట్ కోసం వాడుకుంటున్నారు.

పార్టీకో టీవీ.. డైలీ పేపరు..

మారిన రాజకీయ పరిస్థితులలో జర్నలిజం మరింతా దిగ జారి పోయింది. రాజకీయ పార్టీలకు స్వయంగా పత్రికలు, న్యూస్ టీవీ ఛానల్స్ ఉండటంతో వారిచ్చే వార్త కథనాలు అన్నీ కూడా ఏకపక్షంగా ఉంటున్నాయి. జబర్దస్తూ వార్త కథనాలు ఇచ్చే జర్నలిస్టులు కూడా మనసును చంపుకుని యజమాన్య ఫాలిసీకి అనుకూలంగా తప్పనిసరి వార్తలు రాస్తున్నారు. అలా రాయడానికి నిరాకరించిన జర్నలిస్టుల జీవితం రోడ్ మీద పడుతుంది. గ్యారంటీ లేని జర్నలిస్టుల బతుకులలో ఆర్థిక సమస్యలే అధికం.

జర్నలిస్టులుగా క్రిమినల్స్..

సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి కాలంలో జర్నలిస్టులకు విలువ లేకుండా పోయింది. పదవ తరగతి పాస్ కానోడు, క్రిమినల్ బ్యాక్ రౌండ్ ఉన్నోడు కూడా ‘‘నేను విలేకరిని.. ’’ అంటూ చలామణి కావడంతో జర్నలిస్టుల పరువు పోతుంది. ముఖ్యంగా డిజిటల్ పేపర్స్ వచ్చిన తరువాత జర్నలిజంలో అఆ లు తెలియనోడు కూడా జర్నలిస్ట్ గా చలామణి అవుతున్నాడు.

ప్రెస్ మీట్ పెడితే…

మంత్రి కావచ్చు.. పొలిటికల్ లీడర్ కావచ్చు.. ఇంకెవరైనా ముఖ్యమైన వ్యక్తి ప్రెస్ మీట్ పెడితే వందకు పైగానే విలేకరులు హాజరవుతున్నారు. మెయిన్ పేపరులు.. న్యూస్ ఛానల్స్ రిపోర్టర్ లు కనిపించకుండా పోయారు. ప్రెస్ మీట్ పెడితే తమకు కవర్ లు ఇస్తారనే భావనతో ఎక్కువ మంది విలేకరులుగా హాజరవుతున్నారు.

పెంపుడు కుక్కల్లా…

పొలిటికల్ పార్టీలు పెట్టిన న్యూస్ ఛానల్స్.. డైలీ పేపరులలో పని చేసే జర్నలిస్టులు పెంపుడు కుక్కల్లా పని చేయాల్సిందే. ప్రస్తుతం డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా న్యూస్ ఛానల్స్.. డైలీ పేపరులు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఆ న్యూస్ ఛానల్స్.. డైలీ పేపరుల లక్ష్యం తమ యజమానికి లాభం చేయడమే. నెల నెల వేతనం ఇస్తున్నందుకు పెంపుడు కుక్కలా విశ్వాషంతో పని చేయాల్సి ఉంటుంది.

ఏకపక్ష వార్త కథనాలు..

మారిన కాలంలో సీనియర్ జర్నలిస్టులు కొందరు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు సలహాలు ఇస్తూ వారికి అనుకూలంగా కథనాలు రాసిస్తున్నారు. నిజానికి మారిన జర్నలిజాన్ని చూసి నిక్కచ్చిగా వార్త కథనాలు రాసిన ఒకప్పటి జర్నలిస్టులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ బాధ పడుతున్నారు. ‘‘ మా కాలంలో జర్నలిస్టు అంటే… ఆ గౌరవమే వేరు..’’ అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. ఇరువై ఏళ్ల క్రితం నాటి జర్నలిజంతో పోల్చితే నేడు నైతిక విలువలు పాతాళ లోకానికి పడి పోయాయి.

అసెంబ్లీ ఎన్నికలలో యాడ్స్ టార్గెట్..

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యజమాన్యాలు జర్నలిస్టులకు యాడ్స్ టార్గెట్ ఇవ్వడంతో మనసును చంపుకుని ఆయా పార్టీల అభ్యర్థుల ఇంటి వద్ద పొద్దున్నే వెళ్లి నిరిక్షించే జర్నలిస్టులు వందల్లో ఉన్నారు. యాడ్స్ కోసం వచ్చే వారు వందల్లో ఉండటం వల్ల ఎమ్మెల్యేలు సైతం తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు యూట్యూబ్ ఛానల్ వారు సైతం తమకు యాడ్స్ ఇవ్వాలని అభ్యర్థులపై ఒత్తిడి చేస్తున్నారు. గెలువడం ముఖ్యమని భావించిన అభ్యర్థులు తల కొంత బిక్షం వేసినట్లు డబ్బులు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు.

యాటకర్ల మల్లేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking