సీఎం రేవంత్ రెడ్డిపై కొండంతా ఇళ్ల స్థలాల ఆశలు..

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఆశలు..

– పదేళ్లుగా కేసీఆర్ నమ్మించారు.. మోసం చేశారు..
– ఆన్ లైన్ లో దరఖాస్తులు తీసుకుంటే బెటర్..
– సీనియార్టీ ప్రకారం ఇళ్ల స్థలాలు..
– స్ట్రింగర్.. కంట్రిబ్యూటర్ కు ఇవ్వాలి..

– అన్నీ హౌజింగ్ సోసైటీలను ఆహ్వనించక పోవడమేంటి..?
– ఇళ్ల స్థలాలలో టీయూడబ్ల్యూజే పెత్తనం ఏంది..?

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు.. ఇప్పుడు జర్నలిస్టులందరి నోట వినిపిస్తున్న మాట. కేసీఆర్ అప్పుడు.. ఇప్పుడు అని పదేళ్లు మోసం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే తమకు ఇళ్ల స్థలాలు వస్తాయనే భరోసాలో జర్నలస్టులు ఉన్నారు.
కానీ.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను ఏ పద్ధతిలో ఇవ్వాలనేదే ప్రభుత్వం ముందున్న సవాల్.. జర్నలిస్టుల హౌజింగ్ సోసైటీ ద్వారా ఇళ్ల స్థలాలిస్తారా..? లేక ఆంధ్రప్రదేశ్ లో లాగా ఐ అండ్ పీఆర్ ఆధ్వర్యంలో ఆన్ లైన్ లో దరఖాస్తులు తీసుకుని ఇళ్ల స్థలాలు ఇస్తారా అనేది ఇంకా స్పష్టం కావడం లేదు.

 

ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే..?

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు సాధ్యమైతాయనే టాక్ జర్నలిస్టులలో వినిపిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతీ జర్నలిస్టుకు ట్రిపుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేస్తానని బహిరంగా సభలలో, ప్రెస్ మీట్ లలో చెప్పి మోసం చేసిన సంఘటన సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతునే ఉంది. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

సమస్యగా మారిన అర్హుల ఎంపిక

అర్హులైన జర్నలిస్టుల ఎంపిక ప్రభుత్వానికి సమస్యగా తయారైంది. గ్రేటర్ హైదరాబాద్ లో పది వేలకు మందికి పైగానే జర్నలిస్టులు ఉన్నట్లు యూనియన్ నాయకులు చెబుతున్నారు. కొందరు రెండు, మూడు జర్నలిస్టుల హౌజింగ్
సోసైటీలలో కూడా సభ్యత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకే హౌజింగ్ సోసైటీలలో సభ్యులుగా ఉండాలనే నిబంధన పెట్టడం వల్ల వాస్తవానికి ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారో అర్థమవుతుంది.

ఐ అండ్ పీఆర్ ద్వారా ఆన్ లైన్ లో..

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ లో లాగా ఐ అండ్ పీఆర్ ఆధ్వర్యంలో ప్రక్రియ బెటరంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. హౌజింగ్ సోసైటీల పేరుతో కొందరు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నందున ఆన్ లైన్ దరఖాస్తులు తీసుకుని సీనియార్టీ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం సులువంటున్నారు. అయితే.. ఇప్పటికే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడమే తన ముందున్న కర్తవ్యం అన్నారు.

పదేళ్లు కాలయాపన చేసిన ప్రెస్ అకాడమీ..

కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఎండ మావుల్లాగే కొనసాగాయి. ఎన్నికల ముందు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని అప్పటి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి ద్వారా ప్రకటనలు ఇప్పించారు. కానీ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మాత్రం రాలేవు.

ఇళ్ల స్థలాల పేరుతో టీయూడబ్ల్యూజే పెత్తనం..?

ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రలు సైతం భరోసాగా చెబుతున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో టీయూడబ్ల్యూజే [ఐజేయూ] పెత్తనం ఏమిటో అర్థం కావడం లేదంటున్నారు కొందరు జర్నలిస్టులు. ఇళ్ల స్థలాల విషయంలో సమావేశం నిర్వహించాలంటే ప్రెస్ అకాడమీ హాల్ లో లేదా సెక్రటరేట్ లో జరుపుకోవచ్చు. కానీ.. గురువారం హైదరాబాద్ బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్ లోని టీయూడబ్ల్యూజే ఆఫీస్ లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై చర్చించడం చర్చనీయంశంగా మారింది. తమకు ఇష్టమున్న హౌజింగ్ సోసైటీని ఆహ్వానించి ది గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో – హౌజింగ్ సోసైటీ కి సమాచారం ఇవ్వక పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఆ సోసైటీ సభ్యులు.

మూడు సొసైటీలకే ఆహ్వానమా..?

ఇళ్ల స్థలాల విషయమై చర్చించడానికి ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ, ది హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ, దక్కన్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ ఈ మూడు సొసైటీలను మాత్రమే ఆహ్వానించి ఇళ్ల స్థలాల గురించి చర్చించారు. అయితే.. ది గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో – హౌజింగ్ సొసైటీని ఇళ్ల స్థలాల సమావేశానికి ఆహ్వనించక పోవడం వెనుక టీయూడబ్ల్యూజే కుట్ర ఏమిటో అర్థం కాని ప్రశ్నగా మిగిలి పోయింది. నిజానికి ఆ హౌజింగ్ సొసైటీ 2008లో రిజిస్ట్రేషన్ అయ్యింది.

స్ట్రింగర్ లు జర్నలిస్టులు కారా..?

స్ట్రింగర్.. కరస్పాండెంట్.. కంట్రిబ్యూటర్.. రిపోర్టర్.. స్టాఫ్ రిపోర్టర్.. జర్నలిస్టు.. పేరులు వేరైనా అందరూ జర్నలిస్టులే. గ్రేటర్ హైదరాబాద్ లో విధులు నిర్వహించే స్ట్రింగర్.. కరస్పాండెంట్.. కంట్రిబ్యూటర్ ల జీవితాలు మరీ అధ్వానంగా ఉంటాయి. పత్రికలు.. న్యూస్ ఛానల్స్ వేతనాలు ఇవ్వక పోయినా వెట్టి చాకిరీ చేస్తూ పార్ట్ టైమ్ ఏదో పని చేసుకుని బతుకులు వెళ్ల తీస్తారు. అలాంటి స్ట్రింగర్.. కరస్పాండెంట్.. కంట్రిబ్యూటర్ లకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఓ జర్నలిస్టు యూనియన్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసి స్ట్రింగర్.. కరస్పాండెంట్.. కంట్రిబ్యూటర్ లు ఉద్యమానికి సిద్దమవుతున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టులుగా పని చేసే వారందరికి కేటగిరిలుగా విభజించి ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలం ఇవ్వడంతో సమస్య పరిష్కరం అవుతుందంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. ఒకవేళ ఇళ్ల స్థలాలు అందరికి ఇవ్వనట్లయితే ఎవరైనా బాధిత జర్నలిస్టులు కోర్టుకు వెళితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.

మల్లేష్ యాటకర్ల

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!