కరోనా సృష్టించిన కల్లలోలం..

జనతా కర్ఫ్యూ కు 22 తేదీతో మూడేళ్ళు పూర్తి

కరోనా.. కోవిడ్.. పేరు ఏదైనా ప్రపంచాన్ని అతలకుతలం చేసింది. ఆనాటి రోజులు మళ్లీ చూడలేమెమో.. 22-3-2020 న 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ విధించారు. నేటితో మూడేళ్లు అవుతుంది.

హైదరాబాద్, మార్చి 22 : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత దేశంలో జనతా కర్ఫ్యూ అమలు చేసి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యాయి. 2020 సంవత్సరం మార్చి 22వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు ఈ కర్ఫ్యూను పాటించారు.

కరోనా నియంత్రణకు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రజలంతా సాయంత్రం 5 గంటలకు తమ ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి చప్పట్లతో తమ సంఘీభావం తెలిపారు. ఆ మరుసటి రోజు 23 తేదీ నుంచే లాక్ డౌన్ ప్రకటించారు.

అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. మిగిలిన వారిని ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా,ఇంటికే పరిమితం చేశారు. ఈ పరిస్థితుల్లో 24వ తేదీ నుంచి పలు స్వచ్చంధ సేవా సంస్థలు, పలువురు ఔత్సహికులు తమ స్వంత ఖర్చులతో పనులు లేక ఇళ్లల్లోనే ఉండిపోయిన పేదలందరికీ నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు, బియ్యం, వంట నూనెలు, ఫల సరుకులను పంపిణీ చేశారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »