యాక్టర్ ధనుష్ నయనతార పై 10 కోట్ల నష్టపరిహారం వేయడం.. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కావడం.. ఈ రెండు అంశాలతో హీరోయిన్ నయనతార ట్రేండింగ్ లో ఉంది.
ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌లో ధనుష్ నిర్మించిన ‘నేనూ రౌడీనే’ అనే మూవీ షూటింగ్‌కి సంబందించిన 3 సెకన్ల చిన్న ఫుటేజ్ ని వాడుకున్నందుకు రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్ డిమాండ్ చేశారు, అయితే నయనతార ధనుష్ నుంచి ఎన్‌ఓసీ కోసం 2 ఇయర్స్ వెయిట్ చేశామని ఎలాంటి రెస్పాన్స్ రాలేదని.. చివరికి ఇలా నోటీసులు పంపి, డబ్బులు డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని ఓపెన్ లెటర్లో పేర్కొంది.
తాజాగా నెట్ ఫ్లిక్స్ నయనతార జీవితానికి సంబంధించిన స్టోరీతో ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఇందులో తన ప్రేమ, పెళ్లి, కుటుంబం.. ఇలా అన్ని విషయాలను పంచుకుంది.. దీనితో నయనతార లేటెస్ట్ ఫొటోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి..