‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్ బాగా పాపులర్ అయింది. గత సంవత్సరం ఆహా ఓటీటీలో రిలీజ్ అయినా ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్ 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్క్ తో బాగా పాపులర్ అయింది. ఈ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ‘అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2’ ఈ నెల 31వ తేదీన స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఫేమ్, తెలుగు యంగ్ హీరోయిన్ తేజస్వి మదివాడ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇక తేజస్వి ‘అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ సినిమా కోసం బికినీ షూట్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం తేజస్వి బికిని ఫోటోలు వైరల్ గా మారాయి.