Take a fresh look at your lifestyle.

ఇళ్లు ప్రతి ఒక్కరికి అత్యవసరం.. ఇళ్ల స్థలాల సమస్యపై సీఎంతో చర్చిస్తా…

0 361

ఇళ్లు ప్రతి ఒక్కరికి అత్యవసరం..
ఇళ్ల స్థలాల సమస్యపై సీఎంతో చర్చిస్తా…
– జర్నలిస్టులకు ప్రొఫెసర్ కోదండరాం
నిర్దేశం, హైదరాబాద్ :
ఇళ్లు ఉన్నప్పుడే మనిషికి సోసైటీలో విలువు ఉంటుందన్నారు తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం. ఆ ఇళ్లు వల్ల భద్రత భావం పెరుగుతుందన్నారు ఆయన. మంగళవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, చాలాకాలంగా జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇచ్చే అంశంపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో కొంత సానుకూలంగా ఉందని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకు వెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని, ముఖ్యంగా చిరకాల వాంఛ అయిన ప్రత్యేక తెలంగాణ సాధనలో కూడా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు.

గత ప్రభుత్వం ఒకటి రెండు చోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, తిరిగి తీసుకున్న సంఘటనలు ఉన్నాయని, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమస్య సానుకూలంగా పరిష్కారం జరిగే విధంగా త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతానన్నారు ఆయన. హైదరాబాద్ జిల్లా సహకార శాఖ అధికారి(డీసీఓ) డి.రమాదేవి మాట్లాడుతూ, తమ శాఖ తరఫున జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు.
2008 లో స్థాపించిన ఈ సొసైటీ లోని సభ్యులందరూ బాధ్యతగా ఉండాలని, సొసైటీ బైలా చట్టం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ కోదండరాం, . హైదరాబాద్ జిల్లా సహకార శాఖ అధికారి(డీసీఓ) డి.రమాదేవి, తెలంగాణ జన సమితి నగర అధ్యక్షుడు నర్సయ్యలను గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు సన్మానించారు.


ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి నగర అధ్యక్షుడు నర్సయ్య, సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, కోశాధికారి పిల్లి రాంచందర్, కార్యవర్గ సభ్యులు యర్రమిల్లి రామారావు, భాస్కర్ రెడ్డి, వీరేశం, సీనియర్ జర్నలిస్టులు యాటకర్ల మల్లేష్, పులి పలుపుల ఆనందం, షోయబుల్లాఖాన్, బీఆర్ కే మూర్తి, సతీష్ ముదిరాజ్, కరుణకార్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking