ఫోన్ ట్యాపింగ్ కేసు తీర్పును వాయిదా వేసిన హైకోర్టు
నిర్దేశం, హైదరాబాద్ :
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ రావు పిటిషన్ పై కోర్టులో వాదనలు ముగిచాయి. వాదోపావాదాలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేసారు పోలీసులు. కాగా ఈకేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన రాధాకిషన్ రావు వాదనాలు హైకోర్టు విన్నది. రాధాకిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దన్న పీపీ వాదించారు. కాగా మాజీ మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో చక్రధర్ గౌడ్ పై రాధాకిషన్ రావు అక్రమ కేసులు పెట్టారని హైకోర్టులో పీపీ వాదించారు.