ఒక్కడే 12 ఇండ్లు దోచేసాడు

ఒక్కడే 12 ఇండ్లు దోచేసాడు

– 27తులాల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి స్వాధీనం

– విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు

విజయనగరం, ఆగష్టు 21 : విజయనగరం పట్టణ పరిధిలో 12 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన నేరస్థుడిని అరెస్టు చేసి, 27 తులాల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లుగా విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు.  విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషనులో ఆగస్టు 21న నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.

విజయగనగరం జిల్లా మెంటాడ మండలం కొప్పంగి గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరావు ప్రస్తుతం విజయ నగరం పట్టణంలో ఉడాకాలనీలో నివాసం ఉంటున్నాడని, గతంలో సిఆర్ఎప్ కానిస్టేబుల్గా 10 సం॥లు పనిచేసి, ఉద్యోగం మానేసి, చెడు వ్యసనాలను అలవాటు పడి, సంవత్సరం కాలం నుండి విజయనగరం పట్టణంలోని ఉడా కాలనీ, బాబామెట్ట ఏరియాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడని విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు.

విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం సబ్ డివిజన్డిఎస్పీ శ్రీ ఆర్.గోవిందరావు, 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు, 2వ పట్టణ సిఐ ఎన్.హెచ్. విజయానంద్, ఎస్ఐలు వి. అశోక్ కుమార్, ఎస్. భాస్కరరావు మరియు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »