చెడు ఆలోచనలతో యువత ప్రయాణం

 ప్రియురాలు నిర్లక్ష్యం చేస్తుందని
ప్రియుడి ఆత్మహత్యాయత్నం

జీవితం అంటే ప్రేమెనా..? యువత జీవితం ఎటు ప్రయాణం..?? చిన్న సమస్య ఏర్పడితే చాలు  ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నారా..? ఔను.. ఈ వార్త చదివితే మీకు అదే అనిపిస్తోంది. చావుతో ఏమి సాధించలేమని తెలిసి కూడా ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేయడం క్షణిక ఆవేశమే.. 

గుడివాడ, మార్చి 20 : ప్రియురాలు తనను పట్టించుకోవడంలేదని ఒక  యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే  గుడివాడ పట్టణంలోని మార్వాడి గుడి సెంటర్ కు చెందిన 26 సంవత్సరాలు వయసు కలిగిన శైలెష్ సింగ్ గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా తన తండ్రి నిర్వహిస్తున్న టీ స్టాల్ లో తండ్రితో పాటు చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేవాడు.

ఈరోజు సాయంత్రం తను ప్రేమించిన అమ్మాయి కొద్ది రోజులుగా కొత్త ద్విచక్ర వాహనం మీద తిరగడంతో తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో ఆమెతో ఫోన్లో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఆ యువతీ ఇంటికి వెళ్లి యువతి ఉంటున్న ఇంటి పై పోర్షన్ బాల్కనీ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతని కేకలు విన్న ఆ పోర్షన్లో నివాసం ఉంటున్న వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అతను కాపాడి 108 వాహనములో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సగానికి పైగా అతని శరీరం కాలిపోవడంతో అతనిని మెరుగైన వైద్య చికిత్స కోసం మచిలీపట్నంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!