– గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డీఎస్పీ గంగాధర్
– మార్నింగ్ వాకర్స్ తో ప్రచారం ప్రారంభం
– రాత్రి వరకు నిరాటకంగా ప్రచారం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి డీఎస్పీ గంగాధర్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయమే కరీంనగర్ పట్టణంలోని వాకర్స్ తో కలిసి ప్రచారం ప్రారంభించారు గంగాధర్. ప్రతి ఒక్కరిని కలుస్తూ.. ఎన్నికల ప్రాధాన్యత గురించి చెప్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు. గంగాధర్ చెప్పే విషయాలకు అనేక మంది ఆకర్షితులవుతున్నారు. ఆయన కోసం ప్రచారం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా నగరంలోని అనేక పార్కుల్లో మెరుపు వేగంతో ప్రచారం నిర్వహించారు. అనంతరం, నగరంలోని అనేక మంది యువకులతో వ్యక్తిగతంగా చర్చించారు గంగాధర్. తన నేపథ్యం, తన వృత్తి జీవితం గురించి చెప్తుంటే.. అనేక మంది యువత ఆయనను ఆదర్శంగా తీసుకుంటామని, ఈ ఎన్నికల్లో గంగాధర్ గెలుపు సమాజానికి అవసరమని వారు అంటున్నారు.
డీఎస్పీ గంగాధర్ వర్సెస్ నరేందర్ రెడ్డి
విద్యా సంస్థల యాజమని నరేందర్ రెడ్డి, డీఎస్పీ గంగాధర్ మధ్య పోటీ నెలకొన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. తన పదవికి రాజీనామా చేసి ప్రజా సేవ కోసం ఎన్నికల రంగంలోకి దిగారు గంగాధర్. ఎలాగైన ఎమ్మెల్సీ గా గెలువాలని భావించిన గంగాధర్ గత మూడు నెలలుగా ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేసారు.
నిజానికి నాయకుడు అన్ని చోట్లకు వెళ్లడు. ఆయన మనుషులో లేదంటే ఆయన పార్టీకి చెందిన నాయకులో ఓటర్ల దగ్గరకు వెళ్తుంటారు. కానీ, గంగాధర్ మాత్రం నియోజకవర్గం మొత్తం ఇప్పటికే స్వయంగా పర్యటించారు. నిజానికి ఈ నియోజకవర్గంలో 13 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు అన్ని ప్రాంతాలకు గంగాధర్ స్వయంగా తిరిగారు.
ప్రాంతాలో పాటు.. అనేక సంఘాలను ప్రభుత్వ ఉద్యోగులను నిరుద్యోగులను విద్యార్థులను కలుస్తున్నారు. మిగిలిన పార్టీలు, మిగిలిన అభ్యర్థుల కంటే ముందు వరుసలో ఆయన దూసుకుపోతున్నారు. దీంతో అధికార పార్టీ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డికి స్వతంత్ర అభ్యర్థి గంగాధర్ పోటీగా నిలుస్తున్నారు.
రాజకీయంతో మరింత సేవ చేయాలని
అత్యంత గడ్డు పేదరికాన్ని అనుభవించిన గంగాధర్ కు సమాజంలో మామూలు ప్రజల కష్టాలు తెలుసు. అంతే కాదు, దాన్ని అధిగమించిన వ్యక్తిగా.. ప్రజల కష్టాలకు ఉపాయాలేంటో కూడా ఆయనకు తెలుసు. పోలీసు ఉద్యోగం చేస్తుండగానే ఎంతో మంది యువతకు తనకున్న శక్తి మేరకు ఉద్యోగాలు ఇప్పించేవారు.
అయితే, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి చేస్తున్నదానికి ఎక్కడో బౌండరీ అడ్డు వస్తుందని ఆయన భావించారు. రాజకీయం అయితే ఏ పరిధీ లేకుండా.. అంతకు 100 రెట్లు ఎక్కువ చేయొచ్చనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అంటారు. దీనితో పాటు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని చైతన్యం చేయడమే కాకుండా.. ఎన్నికల సంఘాన్ని పలుమార్లు కలిసి తేదీలు పొడగించేలా చేశారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన బాధ్యతను తెలియజేస్తోంది.
ఎన్నికల బరిలో డీఎస్పీ గంగాధర్ ఉత్తముడు
బీజేపీ ప్రకటించిన అభ్యర్థి సి.అంజారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సహా పలువురు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరంతా డబ్బులతో రాజకీయం చేసే నాయకులు. కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు. వీరితో కంపార్ చేసినప్పుడు డీఎస్పీ గంగాధర్ ఉత్తమ ఎంపికగా కనిపిస్తున్నారు. సామాజికంగా అట్టడుగు వర్గమైన సంచార జాతి నుంచి రావడమే కాకుండా.. చదువుకోవడానికే పెద్ద యుద్ధం చేసిన గంగాధర్.. ఉద్యోగ జీవితంలో అత్యుత్తమ స్థాయికి వెళ్లారు.
దేశంలో ప్రతిష్టాత్మకమైన ఐపీఎస్ స్థాయికి మరికొద్ది రోజుల్లో వెళ్లేవారు. అన్ని అవకాశాలు ఉన్నా.. తనకున్న సామాజిక సేవ ఆలోచనలతో అంతటి అద్భుత అవకాశాన్ని వదులుకుని ఎన్నికల బరిలోకి దిగారు. ఇది ఓటర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. తమలో నుంచి ఎదిగిన వ్యక్తి అయితేనే, గెలిచాక కూడా తమను పట్టించుకుంటాడని అనుకుంటున్నారు.