Take a fresh look at your lifestyle.

పుల్ టైమ్ సాప్ట్ వెర్..  పార్ట్ టైమ్ టిఫిన్ సెంటర్

0 33

భరత్ లైఫ్ స్టైల్..

పుల్ టైమ్ సాప్ట్ వెర్ జాబ్..  పార్ట్ టైమ్ టిఫిన్ సెంటర్ లో వర్క్..

డిగ్రీ పట్టాలు చేత పట్టుకుని నిరుద్యోగంతో బాధ పడుతూ ప్రస్ట్రేషన్ కు గురయ్యే యువతకు భరత్ జీవితం ఆదర్శమే.. సర్కార్ ఉద్యోగం కోసం రాత్రింబగళ్లు కష్టపడి చదివినా సక్సెస్ కాలేక మానసికంగా కృంగి పోయే వారికి నిజంగా ఆ భరత్ లైఫ్ మార్గం చూపిస్తోంది.

భరత్.. పుల్ టైమ్ సాప్ట్ వెర్ జాబ్ చేస్తాడు.. పార్ట్ టైమ్ టిఫిన్ సెంటర్ లో పని చేస్తాడు.. అగో పుల్ టైమ్ సాప్ట్ వెర్ జాబ్ చేస్తున్నప్పుడు పార్ట్ టైమ్ టిఫిన్ సెంటర్ లో పని చేయడం ఏమిటని ఆలోచిస్తున్నారా..? కష్టేఫలి అంటారు పెద్దలు.. కష్ట పడితే ఆదాయం వస్తుందనేది కూడా భరత్ ఆలోచన.

మిల్లిట్స్ టిఫిన్స్..

హైదరాబాద్ నగరం సుచిత్ర – కొంపల్లి మధ్యలో గల జీడిమెట్ల బస్ స్టాండ్ వెనుక గుడిచెలోని ‘మిల్లిట్స్ నేషన్ టిఫిన్ సెంటర్’ లో మెయిన్ కూక్కర్ గా పని చేస్తున్న భరత్ ను మా ‘నిర్దేశం’ ముచ్చటించింది. అతని ఆలోచనను ఎవరైనా ఔరా అనాల్సిందే.

ప్రెండ్స్ తో కలిసి..

ఖమ్మం జిల్లాకు చెందిన భరత్ ఫ్యామిలీ హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో నివాసం ఉంటుంది. డబ్బులైతే ఎలైనా సంపాదించవచ్చు.. కానీ.. ఆరోగ్యకరంగా డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచన చేసారు భరత్. అప్పటికే సాప్ట్ వెర్ జాబ్ చేస్తున్న అతను అదనంగా డబ్బులు సంపాదించాలని తన స్నేహితులు శివ, అశోక్ లతో కలిసి కూకట్ పల్లిలో మిల్లిట్స్ టిఫిన్ సెంటర్  పెట్టారు. కొంతకాలంలో ఆ టిఫిన్ సెంటర్ బాగా ప్రాపులర్ అయ్యింది. కానీ.. ఆ ఫ్రెండ్స్ మధ్యన మనస్పర్థాలు వచ్చాయి. అప్పటి వరకు కష్టాలలో.. సుఖాలలో కలిసి ఉన్న ఆ దోస్తులంతా విడి పోయారు.

డిగ్నిటీ ఆప్ లేబర్..

కానీ.. భరత్ మాత్రం తన ఫ్యామిలీతో కలిసి జీడిమెట్ల బస్టాండ్ వెనుక తాత్కలికంగా గుడిచే వేసుకుని ‘మిల్లిట్స్ నేషన్ టిఫిన్ సెంటర్’ ప్రారంభించారు. బస్టాండ్ ఒకవైపు మరోవైపు దేవాలయం.. ఇంకోక వైపు స్పోర్ట్స్ గ్రౌండ్ ఉండటంతో టిఫిన్ సెంటర్ మూడు ఇడ్లీలు.. ఆరు వడల్లా బిజినెస్ సాగుతుంది. పుల్ టైమ్ సాప్ట్ వెర్ జాబ్ చేసే భరత్.. టిఫిన్ సెంటర్ లో పార్ట్ టైమ్ జాబ్ లా పని చేస్తూ ఫ్యామిలీకి సహాకరిస్తున్నారు. డిగ్నిటీ ఆప్ లేబర్ లా ఫీలై హర్డ్ వర్క్ చేస్తే హైదరాబాద్ నగరంలో ఉపాధికి ఎన్నో మార్గలున్నాయంటారు భరత్..

ఫ్యామిలీ అంతా కష్టపడుతారు..

ఈ ‘మిల్లిట్స్ నేషన్ టిఫిన్ సెంటర్’ ప్రత్యేక ఏమిటో తెలుసా.. అక్కడా పని చేసే వాళ్లంతా భరత్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే..  ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నట్లుగా అన్నీ మిల్లిట్స్ తోనే టిఫిన్ తయారు చేసి వడ్డిస్తుంటారు. అమ్మో.. మిల్లిట్స్ టిఫిన్స్ బాగా ధర ఉంటాయని భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్ టిఫిన్ ధరలే.. టెస్ట్ అంటావా..? మీరే తిని చెప్పండి. ఒక్కసారి అక్కడా టిఫిన్ చేస్తే మరోసారి వెళ్లకుండా ఉండలేరానేది నాది గ్యారంటీ.

ఉద్యోగం లేదని జీవితం మీద విరక్తి పెంచుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న నేటి యువతకు భరత్ లైఫ్ స్టైల్ స్పూర్తిగా నిలుస్తోంది కదూ..

  • యాటకర్ల మల్లేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking