సక్సెస్ స్టోరీ
సంచార జీవితం నుంచి శాస్త్రవేత్త స్థాయి వరకు
డాక్టర్ గురుస్వామి జీవిత ప్రస్థానం..
ఆర్థిక సమస్యలను సవాల్ చేస్తూ..
‘చదువు’ కు వంగి సెల్యూట్ చెప్పిన సక్సెస్
అతను నిరుపేద కుటుంబంలో పుట్టాడు.. సంచారం చేసే జాతీలో పెరిగాడు. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాడు.. కానీ.. చదువే అన్నిటికీ పరిష్కర మార్గంగా భావించాడు. చదువు అనే ఆయుదంతో ఏదైనా సాధించ వచ్చానే ఆలోచనలతో సర్కార్ బడి వైపు తొలి అడుగులు వేశాడు. సంచార జీవితం మరియు పేదరికం తన చదువుకు సమస్యలు కాకూడదని ప్రతిక్షణం ఆలోచన చేసేవారు. చదువుకు ఆర్థిక సమస్యలు అడ్డు రాకూడదని భావించి వివిధ రకాల పనులు చేస్తూ సంచార జీవితం నుంచి శాస్త్రవేత్త స్థాయి వరకు ఎదిగిన డాక్టర్ సిరిగిరి గురుస్వామి సక్సెస్ స్టోరీ..
గురుస్వామి ప్రస్థానం…
సిరిగిరి గురుస్వామిది వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చెలిమెల్ల గ్రామం. సిరిగిరి మునెమ్మ – భీమన్న దంపతులకు ఏడుగురి సంతానంలో నాలుగవ వాడు అతను. గురుస్వామికి ఇద్దరు అక్కయ్యలు ఒక అన్నయ్యా ఇద్దరు తమ్ముళ్లు ఒక చెల్లి ఉన్నారు. అఆ ల నుంచి డాక్టరేట్ వరకు విద్యాభ్యాసం అంతా సర్కార్ విద్యాలయాలలోనే పూర్తి చేశారు. కానీ.. ఆ డాక్టరేట్ సాధించే వరకు పడిన కష్టాలను సవాల్ గా స్వీకారించి బాల్యం నుండి శాస్త్రవేత్త ‘(సైంటిస్ట్)’’ కావాలనుకున్నిది సాధించాడు డాక్టర్ గురుస్వామి.
చదువునే ఆయుదంగా..
ఔను.. చదువునే ఆయుదంగా భావించాడు గురుస్వామి. ఏడుగురు సంతానంను పెంచడానికి తల్లిదండ్రులు పడుతున్న బాధలను కళ్లతో చూశాడు. చదువు కొనసాగిస్తున్నప్పుడు తాను తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కావద్దానుకున్నాడు. అంతే.. స్కూల్ కు సెలవు ఇవ్వగానే పని బాట పట్టేవాడు గురుస్వామి.
కూలీగా.. టైలర్ గా.. అటో డ్రైవర్ గా..
గురుస్వామి ఆర్థిక సమస్యలను అధిగమించడానికి తాను అన్నీ పనులు చేశాడు. చదువుకుంటునే తాను కూలీ పని చేయడానికి వెళ్లేవారు. టైలర్ గా పార్ట్ టైమ్ పని చేశాడు. లెమన్ సోడా అమ్మాడు. జీరో ఫైనాన్స్ లో పని చేసాడు. అటో రిక్షా నడిపించాడు. వేసవి సెలవుల్లో ఖర్చుల కోసం హైదరాబాద్ లో అడ్డ మీద కూలీగా కూడా పని చేశారు గురుస్వామి. అయినా.. ఏ పని చేసిన డిగ్నిటీ ఆఫ్ లేబర్ గా భావించాడు గురుస్వామి. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తాను వచ్చిన గత జీవితంలోని ఆంశాలను పరిగణలోకి తీసుకుని నేడు వేలాది మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలోని పాఠ్యంతో పాటు జీవిత పాఠాలు బోధిస్తున్నారు డాక్టర్ గురుస్వామి. అయినా.. అతనికి క్రీడలంటే మక్కువ ఎక్కువే. ఏ మాత్రం సమయం దొరికినా.. గ్రౌండ్ లో ఉండేవాడు గురుస్వామి.
ఉద్యమ చరిత్ర:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగే ఉద్యమంలో తాను సైతం అంటూ ముందుకు కదిలాడు గురుస్వామి. విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పని చేశాడు.
ఉస్మానియా యూనివర్సిటీలో టర్నింగ్..
గురుస్వామి స్థానిక పాఠశాలల్లో పదవ తరగతి వరకు మరియు వనపర్తిలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాడు. అయినా.. ఇంకా ఉన్నత చదువులు చదువు కోవాలనుకున్నాడు. బేడ బుడగ జంగం జాతీలో ఉన్నత చదువులు చదివిన వారు వేళ్లపైనే లెక్కించ వచ్చని గుర్తు చేసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యువేషన్ చేయాలంటే అక్కడ సీటు రావడం ముఖ్యం అనుకున్నాడు. బాల్యంలోనే తాను సైంటిస్ట్ కావాలనే సంకల్పం కళ్ల ముందు కదిలింది. దీంతో సైన్స్, సోషల్ మరియు ఎడ్యుకేషన్ లో వివిధ రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాడు. సైంటిస్ట్ కావాలనే కోరికకు పునాదులు వేసుకున్నాడు. ఎంఎస్సీ (జంతు శాస్త్రం)లో సీటు సాధించాడు గురుస్వామి. అంతే.. ఆ ఉస్మానియా యూనివర్సిటీలోని ‘చదువు’ సమాజాన్ని చూపింది. భవిష్యత్ కు ప్రణాళిక రూపొందించుకుని ముందుకు అడుగులు వేశారు. ఆ ఓయూలోనే ఎంఎ, బీఈడీ పూర్తి చేశారు. టెట్ అర్హత సాధించాడు.
అసిస్టెంట్ ప్రెఫెసర్ గా..
గురుస్వామి ఉన్నత విద్య బోధనకు కావాలసిన సెట్ అర్హత సాధించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో గత దశాబ్ద కాలంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. బోధనతో పాటు యూనివర్సిటీ కి సంబంధించి వివిధ అదనపు బాధ్యతలు నిర్వహించాడు. జంతు శాస్త్రంలో విభాగదిపతిగా పనిచేశారు. జంతుశాస్త్ర విద్యార్థులకు వ్యవసాయ కీటక శాస్త్రాన్ని బోధిస్తూ వ్యవసాయ రంగంపై, పరాన్నజీవ కీటకాల నివారణపై అవగాహన పెంపొందిస్తున్నారు.
డాక్టరేట్ సాధించడానికి..
గురుస్వామి సైంటిస్ట్ కావాలనే కోరిక నెరవేర్చుకోవాలని అడుగులు వేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్ డి లో అడ్మిషన్ పొందారు. జంతు శాస్త్ర విభాగధిపతి ఆచార్య ఎమ్ మాధవి పర్యవేక్షణలో గురుస్వామి పీహెచ్ డి పరిశోధన చేశాడు. అతడు జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పలు పరిశోధన పత్రాలను సమర్పించి, విద్యారంగా నిపుణులచే ప్రశంసలు అందుకున్నాడు. “డైవర్సిటీ అండ్ ఎకాలజీ ఆఫ్ స్పైడర్ పాన ఇన్ డిఫరెంట్ ఆగ్రో ఎకో సిస్టమ్స్ ఆఫ్ మహబుబ్ నగర్ డిస్ట్రిక్ట్- తెలంగాణ” అనే అంశంపై విస్తృత పరిశోధన చేసినందుగాను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్ర విభాగం నుండి డాక్టరేట్ పట్టా లభించింది.
రైతులకు జీవకారకాలపై..
తన పరిశోధన ద్వారా వ్యవసాయ రంగంలో రైతులకు ఉపయోగపడే జీవకారకాలను గుర్తించి వాటిపై అవగాహన కల్పించారు. తద్వారా రైతులు విచ్చలవిడిగా వాడే రసాయనాలను తగ్గించవచ్చునని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తన యొక్క గురువులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, తోటి అధ్యాపకులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ… డాక్టరేట్ సాధించిన గురుస్వామి జీవితం నేటి విద్యార్థి లోకానికి స్పూర్తిగా నిలుస్తోంది కదూ.. కంగ్రాట్స్ డాక్టర్ గురుస్వామి.
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్