నలుగురు స్టూడెంట్స్ మిస్సింగ్
హైదరాబాద్, నిర్దేశం:
అంబర్ పేట్ లో నలుగురు విద్యార్థులు మిస్సింగ్ అయ్యారు. ప్రేమ్ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు, పరీక్షలో కాపీ కొడుతుండగా దొరికిపోయారు. తల్లిదండ్రులకు చెప్తానని టీచర్లు అనడంతో సాయంత్రం ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకొని ఇంట్లో నుంచి స్టూడెంట్స్ వెళ్లిపోయారు. కనిపించిన నికిత్, హర్ష, అజ్మత్, నితీష్ సికింద్రాబాద్ లోని సీసీటీవీలో కనిపించారు. పోలీసులు సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.