నిర్దేశం, హైదరాబాద్: నాణ్యత, సస్టైనబిలిటీకి కట్టుబడిన ప్రముఖ డి2సి డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్స్, ఈరోజు గచ్చిబౌలి ప్రాక్టీస్ స్టేడియంలో తమ మొదటి హైదరాబాద్ హెల్త్ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అన్ని వయసు విభాగాలకు చెందిన 2,000 మందికి పైగా రన్నర్‌లు ఉత్సాహంగా పాల్గొన్నారు, ఇది ఫిట్‌నెస్, కమ్యూనిటీ, శ్రేయస్సు కోసం అంకితమైన అద్భుతమైన రోజుగా మారింది.
ఈ రన్ లో నగరవాసులు మూడు కేటగిరీలు – 10కె టైమ్డ్ రన్, 5కె టైమ్డ్ రన్ మరియు 2కె నాన్-టైమ్డ్ రన్ – లో పాల్గొన్నారు. వివిధ స్థాయిలలో ఫిట్‌నెస్ ప్రేమికుల అవసరాల ఇవి తీర్చాయి. కుటుంబాలు, పిల్లలు మరియు అన్ని వర్గాల ఫిట్‌నెస్ అభిమానులు ఈ ఈవెంట్‌కు మద్దతుగా నిలిచారు, ఆరోగ్యం పట్ల తమ భాగస్వామ్య నిబద్ధతను ప్రదర్శించారు. ఈ రేసులు పోటీతత్వంతో కూడుకున్నప్పటికీ వినోదభరితంగా జరిగాయి, పిల్లల నుండి వృద్ధుల వరకు, పురుషులు మరియు మహిళలు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు పాల్గొన్నారు. ఈ ఉత్తేజకరమైన ఈవెంట్‌ని విజయవంతంగా అమలు నిర్వహించటం లో గిగిల్ మగ్ ఈవెంట్స్ ఆర్గనైజర్ కీలకపాత్ర పోషించింది.
“సిద్స్ ఫార్మ్స్ లో, మా అధిక-నాణ్యత పాల ఉత్పత్తుల ద్వారా మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ద్వారా కమ్యూనిటీని పెంపొందించుకోవాలని మేము ఎల్లప్పుడూ విశ్వసిస్తున్నాము” అని సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ ఇందుకూరి అన్నారు. “హైదరాబాద్ హెల్త్ రన్ అనేది ఫిట్‌నెస్ యొక్క వేడుక మరియు హైదరాబాద్ ప్రజలకు తిరిగి ఇచ్చే మార్గం, ఆరోగ్యాన్ని జీవిత మార్గంగా స్వీకరించమని వారిని ప్రోత్సహిస్తుంది. సమాజం నుండి ఈ కార్యక్రమానికి వచ్చిన అద్భుతమైన స్పందన పట్ల మేము సంతోషంగా వున్నాము, ఇంతమందిని చూడటం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది” అని అన్నారు.