Take a fresh look at your lifestyle.

అగ్ని ప్రమాదాలను సీరియస్​గా తీసుకోవాలి : కేంద్ర మంత్రి

0 121

అగ్ని ప్రమాదాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకోవాలి

– సికింద్రాబాద్​లో తరచూ ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి.

– అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు

– జనావాసాల మధ్య ఉన్న అనధికార గోడౌన్లను సిటీ బయటకు తరలించాలి

– రామ్​గోపాల్​ పేట ఫైర్ యాక్సిడెంట్ బిల్డింగ్​ను పరిశీలించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

– చుట్టు పక్కల ఆందోళన చెందుతున్న ప్రజలకు పరామర్శ

– వారికి మెడికల్ క్యాంపు, భోజన వసతి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం

: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

సికింద్రాబాద్: సికింద్రాబాద్ పరిధిలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, జనావాసాల మధ్యలో ఉన్న గోడౌన్లు, వేర్ హౌజ్ల వివరాలు తీసి, అనధికారికంగా ఉన్న వాటిని సిటీ బయటకు తరలించాల్సిన అవసరం ఉందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.

రామ్గోపాల్ పేటలోని ఓ బిల్డింగ్లో గురువారం అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమని అన్ని అన్నారు. గురువారం బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ వార్త తెలుసుకున్న కేంద్ర మంత్రి శుక్రవారం ఉదయం ఫ్లైట్కు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకొని అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

ప్రమాదం జరిగిన బిల్డింగ్ సమీపంలోని ఇండ్ల ప్రజలు భయాందోళనతో రాత్రంతా రోడ్లపైనే ఉండగా, కేంద్ర మంత్రి వారి మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్నారు. వారికి వెంటనే భోజనం ఏర్పాటు, మెడికల్ క్యాంప్ పెట్టడంతోపాటు ఇతర సౌకర్యాలపై దృష్టి పెట్టాలని స్థానిక బీజేపీ కార్పొరేటర్ను, అధికారులను కోరారు.

ఈ సందర్భంగా బాధిత ప్రజలు వారి ఇండ్లకు జరిగిన నష్టం గురించి కేంద్ర మంత్రికి విన్నవించారు. ప్రభుత్వం నుంచి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ‘‘సికింద్రాబాద్ పరిధిలో గోడౌన్లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ మధ్య చాలా మంది చనిపోయారు. ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి.

జనావాసాల మధ్యలో ఉన్న గోడౌన్లు, వేర్ హౌజ్ల వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి, అక్రమంగా కొనసాగుతున్న వాటిని సిటీ బయటకు తరలించాలి. నిబంధనల ప్రకారం ఉన్న గోడౌన్లలో ఫైర్ సెఫ్టీ పాటించేలా చర్యలు తీసుకోవాలి. నిన్నటి ఫైర్ యాక్సిడెంట్లో ఇప్పటి వరకు ఎవరూ చనిపోయినట్టు తేలలేదు.

ఎలాంటి ప్రాణ నష్టం జరుగొద్దనే కోరుకుంటున్న. కానీ చుట్టు పక్కల ఉన్న పేదల ఇండ్లు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వారికి సాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రమాదం జరిగినప్పటి నుంచి వారు రోడ్లపైకి వచ్చి భయాందోళన చెందుతున్నారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్నూ పూర్తి స్థాయిలో కూల్చి, పరిస్థితులు కుదుట పడే వరకు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు భోజనం, వసతి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది.

Leave A Reply

Your email address will not be published.

Breaking