బాలీవుడ్ కు లైఫ్ ఇచ్చిన చావా
ముంబై, నిర్దేశం:
బాలీవుడ్ లో ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ‘చావా’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, పుష్ప 2 తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ మరోసారి వెలిగిపోతుంది. ఛావా సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తుంది. 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది ఛావా. ఈ దూకుడు చూస్తుంటే 400 కోట్లు ఈజీనే అనిపిస్తుంది.. ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరోచిత గాధను డైరెక్టర్ లక్ష్మణ్ అద్భుతంగా చూపించడంతో ఈ సినిమాకి నార్త్ ఇండియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా హీరో విక్కీ కౌశల్ అద్భుత నటన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించేలా చేసింది. కచ్చితంగా ఈ సినిమాతో ఆయన నేషనల్ అవార్డుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని చూసిన ప్రతీ ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొదటి వారంలో 247 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ వారం లోనూ అదే తరహా జోరుని కనబరుస్తూ ముందుకు దూసుకుపోతుంది. 9వ రోజు ఈ చిత్రానికి కేవలం బుక్ మై షో యాప్ నుండి 9 లక్షల టిక్కెట్లు అమ్మడుపోయాయి. కేవలం ‘పుష్ప 2’ కి తప్ప ఈ రేంజ్ టికెట్ సేల్స్ ఇప్పటి వరకు ఏ సినిమాకి జరగలేదు.. ఇప్పుడు సీన్ చూస్తుంటే పుష్పని కూడా చావా క్రాస్ చేస్తుందని టాక్ నడుస్తోంది.బాక్స్ ఆఫీస్ వసూళ్లు అయితే 9వ రోజు దాదాపుగా 44 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. ఇక పదవ రోజు అయితే బుక్ మై షో యాప్ లో దాదాపుగా 10 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయని టాక్. ఇండియా వెర్సస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పటికి ఈ రేంజ్ వసూళ్లు అంటే ఆడియన్స్ లో ఈ సినిమాకి ఉన్నటువంటి మౌత్ టాక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న ముందస్తు సమాచారం ప్రకారం ఈ సినిమాకి పదవ రోజు 60 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. మొత్తం మీద 9 రోజులకు 293 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, పది రోజులకు గాను 353 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు.ఇప్పట్లో ఈ సినిమా వసూళ్లు తగ్గేలా కనిపించడం లేదు. వచ్చే వారం తో ఈ సినిమా 500 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరనుంది. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ కి డిమాండ్ మామూలు రేంజ్ లో లేదు. మన ఆడియన్స్ మేకర్స్ ని ట్యాగ్ చేసి, కచ్చితంగా ఈ సినిమాని తెలుగు లో రిలీజ్ చేయాలనీ ప్రతీ రోజు ట్విట్టర్ లో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. గతేడాది స్త్రీ 2 తర్వాత మరే హిందీ సినిమాకు వందల కోట్ల వసూళ్లు రాలేదు. బాలీవుడ్ మళ్లీ గాడి తప్పుతుందా అనుకుంటున్న సమయంలో ఛావాకు వస్తున్న వసూళ్లు చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ ఊపు రాబోయే సినిమాలకు ఉపయోగపడితే అదృష్టమే. త్వరలోనే సికిందర్‌తో రాబోతున్నారు సల్మాన్ ఖాన్. తెలుగు లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారని, ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తాడని, రాజమౌళి ప్రొమోషన్స్ లో పాల్గొంటాడని, ఇలా ఎన్నో రకాల రూమర్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ తెలుగు లో రిలీజ్ చేస్తే ఫుల్ లో రన్ మరో వంద కోట్ల రూపాయిల గ్రాస్ అదనంగా రావొచ్చు.