Take a fresh look at your lifestyle.

పోలీసుల అదుపులో నకిలీ అధికారి

0 12

పోలీసుల అదుపులో నకిలీ అధికారి
– వారం రోజులుగా హడాలి పోయిన అధికారులు
నిర్దేశం, సంగారెడ్డి :
అతను సూట్ బూట్ వేసుకున్నాడు.. తాను సీఎం పేసీ దూతగా అధికారులకు పరిచయం చేసుకున్నాడు.. అంతే.. అధికారులు హడాలి పోయారు. ఫైనల్ గా అతను నకిలీ అధికారి అని తెలిసుకుని అధికారులు ఊపీరి పీల్చుకుంటున్నారు. అనిరుద్ గా పేరు చెప్పిన ఆ నకిలీ అధికారి కోసం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ అమీన్ పూర్ పోలీసులు గాలిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తాను వచ్చానని, సీఎం పేషీ దూతగా పేర్కొంటూ సీసీఎల్ ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్ చేశారని బిల్డప్ ఇస్తూ కొన్ని రోజులుగా అలజడి సృష్టించాడు. మండల పరిధిలోని ప్రభుత్వ భూముల పూర్తి రికార్డులు తనకు కావాలని, ప్రభుత్వ భూముల చుట్టూ ఫిన్సింగ్ వేసే పూర్తి బాధ్యత తనకే అప్పగించారని రెవెన్యూ అధికారులను తనతో చెరువుల చుట్టూ తిప్పించుకున్నాడు.

అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేసి అమీన్పూర్ మండలం పటేల్ గూడా గ్రామపంచాయతీ పరిధిలోని ఓ వెంచర్ లో సంబంధిత శాఖలకు సంబంధించిన ఏ ఒక్క అధికారికి సమాచారం లేకుండానే జేసీబీల సహాయంతో ఏకంగా ఇళ్లను కూల్చివేయించాడు. గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యదర్శి కానీ, ప్రత్యేక అధికారికి కానీ తెలియకుండానే కూల్చివేసేంత సాహసం చేయడం ఏంటని అందరూ విస్మయానికి గురవుతున్నారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఫోన్ చేసి మీ పరిధిలో ఇస్తున్న అనుమతుల పూర్తి డాటా తన ముందు ఉంచాలంటూ హుకుం జారీ చేశాడు. ప్రభుత్వ కార్యాలయాలనే కాదు ప్రైవేటు ప్రాపర్టీ లోను అనిరుధ్ తలదూర్చి బిల్డింగ్ కు తీసుకున్న అనుమతులు ఎంత కడుతున్న నిర్మాణం ఎంత అంటూ బిల్డర్లకు బెదిరింపులకు గురి చేశాడు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్ల వద్దకు వెళ్లి పర్మిషన్ కాఫీలు ఇవ్వాలంటూ నానా హడావిడి చేశారు. పటేల్ గూడ ఈఓ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసిన అమీన్ పూర్ పోలీసులు రెండు రోజులుగా అనిరుద్ పై ఆరా తీశారు. నకిలీ అధికారి అని తేలడంతో కేసు నమోదు చేసి అనిరుధ్ ని అదుపులోకి తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking