హైదరాబాద్‎లో నకిలీ కాల్ సెంటర్ స్కాం గుట్టురట్టు

హైదరాబాద్‎లో నకిలీ కాల్ సెంటర్ స్కాం గుట్టురట్టు

హైదరాబాద్, నిర్దేశం:
హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగు చూసింది. దిమ్మతిరిగిపోయే కాల్ సెంటర్ స్కామ్ గుట్టు రట్టైంది. నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి విదేశీయులను మోసం చేస్తున్న ముఠాని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ కి చెందిన మనస్విని సహా 63 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఎక్సిటో సొల్యూషన్స్ పేరిట మనస్విని కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. కైవాన్ పటేల్, ప్రతీక్, రాహుల్ తో కలిసి ఈ కాల్ సెంటర్ ను నిర్వహిస్తోంది. పలువురు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తులని టెలీ కాలర్స్ గా నియమించుకుంది. అమెరికన్లే ప్రధాన లక్ష్యంగా నిందితులు మోసాలకు పాల్పడుతున్నారు. హ్యాక్ అయిన బ్యాంక్ ఖాతాలు సరి చేస్తామంటూ బాధితులకు ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి నగదు కాజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుల నుంచి 63 ల్యాప్ ట్యాప్ లు, 52 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..” పే పాల్‌ నకిలీ కాల్ సెంటర్‌ కేసులో 63 మందిని అరెస్ట్ చేశాం. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 50 మందితో పాటు 11 మంది హైదరాబాదీలను అదుపులోకి తీసుకున్నాం. 63 మందిని కోర్టులో హాజరుపరిచాం. వారికి రిమాండ్ విధించింది కోర్ట్. ఇంగ్లీష్ భాషపై పట్టు ఉన్నందునే కాల్‌ సెంటర్‌లో ఉద్యోగం ఇచ్చారు. జాదు రూపేష్‌తో కలిసి కాల్‌ సెంటర్ ఏర్పాటు చేసింది మనస్విని. డబ్బు కోసం కాల్ సెంటర్‌లో అమ్మాయిలతో బిజినెస్‌ చేస్తోంది. పే పాల్ పేరుతో అమెరికన్లకు నకిలీ ఈమెయిల్స్ పంపుతారు. ఈ మెయిల్స్‌కు రెస్పాండ్ అయిన అమెరికన్ల నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించాం. కొట్టేసిన డబ్బుంతా క్రిప్టో కరెన్సీలో మార్చింది ముఠా.పే పాల్‌లో నకిలీ కాల్‌ సెంటర్ లో పని చేస్తున్న ఉద్యోగులను నిర్బంధంలో పెట్టింది మనస్విని. పీజీ హాస్టల్‌లో ఉద్యోగులను పెట్టి ప్రతిరోజు రాత్రి కాల్ సెంటర్‌కు తరలిస్తోంది. 8 గంటలపాటు బలవంతంగా పని చేయించి తర్వాత హాస్టల్‌కు పంపుతుంది మనస్విని” అని పోలీసులు వెల్లడించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »