Take a fresh look at your lifestyle.

పొలిటికల్ వార్.. ఆర్మూర్ లో ఫ్యాక్షన్ రాజకీయాలు షురూ..?

0 21

నువ్వో నీచ్ కమీనే.. అరేయ్ నీవో సైకోవ్

– ఆర్మూర్ లో ఫ్యాక్షన్ రాజకీయాలు

రాకేష్ రెడ్డి నరహంతకుడు.. స్మగ్లర్.. డ్రైవర్ ను హత్య చేశాడు.. ఊళ్లో కట్టేసి కొట్టారు.. : జీవన్ రెడ్డి

ఓరేయ్ జీవన్ పెళ్లి చేసుకుంటే నీకెందుకు చెప్పాలి రా.. వాడో పిచ్చోడు.. పాగలైండు.. ఎర్రగడ్డకు పోతాడు.. : రాకేష్ రెడ్డి

(యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్ )

వాడో నీచ్ కమీనే.. ఓరేయ్ జీవన్ గా నీ అంతు చూస్తా అంటూ హెచ్చరిస్తున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..

అరేయ్ నీవో డ్రగ్గిస్ట్, స్మగ్లర్, సైకోవ్.. నన్నేమి చేయలేవురా అంటున్నాడు తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..

పుష్ప సినిమాలా ఇద్దరూ కూడా తగ్గెదేలే.. అన్నట్లుగా వారి మధ్య వైరం తారా స్థాయికి చేరింది. ఆ ఇద్దరి మధ్య డైలాగ్ లు చూస్తూంటే క్రైమ్.. సస్పెన్స్.. స్మగ్లింగ్.. థ్రిల్లింగ్ సినిమాను మరిపిస్తున్నాయి.

జుగుప్సకరంగా మాటల యుద్దం..

రాకేష్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డిల మధ్య పొలిటికల్ వార్ తో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజక వర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు షురూ అయ్యాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వర్సెస్ ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిల మధ్య మాటల యుద్దం జుగుప్సకరంగా మారాయి.

ఎన్నికలప్పుడే రాజకీయాలు… కానీ..

ఒక్కోక్కరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం వల్ల రాకేష్ రెడ్డి – జీవన్ రెడ్డిల గురించి ఆర్మూర్ ప్రాంతంలో పెద్ద చర్చా ప్రారంభమైంది. ఒకప్పుడు సంతోష్ రెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, బాజిరెడ్డి గోవర్దన్ ఎమ్మెల్యేలుగా ప్రజలకు సేవాలందిచారు.

ఎన్నికలప్పుడు రాజకీయాలలో నువ్వా – నేనా అనే రీతిలో పొలిటికల్ వార్ ఉండేది. వాళ్లెప్పుడు కూడా రాకేష్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డిలా వ్యక్తిగత విమర్శలకు వెళ్లలేదు..

ఫంక్షన్ లలో కలిసినా.. పెళ్లిలలో ఎదురు పడినా సంతోష్ రెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, బాజిరెడ్డి గోవర్దన్ లు పరస్పరం పలుకరించుకునే వాళ్లు. రాష్ట్ర రాజకీయాలకు స్పూర్తిగా నిలిచిన ఆర్మూర్ ప్రాంతంలో ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాల వాతవరణం కనిపిస్తోంది.

ముగ్గురి మధ్య పోటీ.. అయినా..?

అసెంబ్లీ ఎన్నికలలో ఆర్మూర్ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, బీఆర్ ఎస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా వినయ్ రెడ్డి పోటీ చేశారు. ఈ ముగ్గురి మధ్య పోటీ నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం జరిగింది.

కానీ.. ఆ ఎన్నికలలో రాకేష్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డిలు వ్యక్తిగత విమర్శలకు వెళ్లారు. అలా వెళ్లడం వల్లే రాకేష్ రెడ్డి గెలుపు సులువైందానే టాక్ వినిపిస్తోంది. అప్పటి వరకు జీవన్ రెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేయడానికి భయపడే పరిస్థితులు.. కానీ.. రాకేష్ రెడ్డి ఎన్నికల బరిలో దిగడంతో ఇద్దరి మధ్య నువ్వా నేనా అనే రీతిలో వ్యక్తిగత విమర్శలతో ముందుకు వెళ్లారు.

అసెంబ్లీ ఎన్నికలలో శతృవులుగా…

బీఆర్ ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి రాకేష్ రెడ్డిలు అసెంబ్లీ ఎన్నికలలో వ్యక్తిగత ఆరోపణలతో శతృవులుగా మారారు. ఆ ఇద్దరూ చేసుకున్న ఆరోపణలు ఆర్మూర్ ప్రాంతంలో చర్చనీయంషంగా మారాయి. ఆ ఇద్దరి వద్ద లైసెన్స్ డ్ గన్ లు ఉన్నాయి.

ప్రత్యక్షంగా ఎదురు పడితే కాల్చుకునే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఎమ్మెల్యేగా రాకేష్ రెడ్డి గెలుపుకు ప్రధాన కారణం జీవన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతనే. పదేళ్ల పాటు ఇష్టరాజ్యంగా వ్యవహరించిన జీవన్ రెడ్డికి తగిన మొనగాడుగా రాకేష్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లాడు. ఇంత కాలం ఆర్మూర్ ప్రాంతంలో ధైర్యంగా వార్త కథనాలు ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయాయంటున్నారు లోకల్ విలేకరులు. అయినా.. ఆ ఇద్దరూ ఆర్థికంగా, కండ బలంలోనూ సమానంగా ఉన్నారు. ఇద్దరి సామాజిక వర్గం కూడా ఒక్కటే.

ఇంతకు రాకేష్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ వ్యక్తిగత కక్షలకు దారి తీస్తున్నందును భవిష్యత్ లో ఇంకెన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందోనని ఆర్మూర్ ప్రాంతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking