- ఓటర్ల పల్స్ పట్టుకోవడంలో ఫెయిల్
పేరు పొందిన పెద్ద సర్వే సంస్థలన్నీ ఫెయిల్
ఏకంగా 100 స్థానాలు తప్పుగా అంచనా
నిర్దేశం, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో ఓటర్ల పల్స్ పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్ సంస్థలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మూడు రోజుల క్రితం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాలకు ఎన్నికల సంఘం విడుదల చేసిన అధికారిక ఫలితాలకు ఎంతమాత్రం పొంతన కుదరడం లేదు. కేంద్రంలో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేరు పొందిన సర్వే సంస్థలన్నీ జోస్యం చెప్పాయి. కానీ, మెజారిటీ మార్కును అందుకోవడానికి మిత్రపక్షాలన్నిటితో కలిసి బీజేపీ చాలా పోరాడాల్సి వచ్చింది. అలాగే ఇండీ కూటమి విషయంలో కూడా ఇదే జరిగింది. కూటమికి 150 స్థానాల లోపే వస్తాయని చెప్పినప్పటికీ అంచనాలకు మించి 100 సీట్లు ఎక్కువే సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ పడీ లేచి పదేళ్ల తర్వాత 100 మార్కును తాకడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే జరిగింది. నిజానికి సర్వేల్లో చెప్పినట్టు కూటమి గెలిచినప్పటికీ, సీట్ల విషయంలో చాలా తేడా వచ్చింది. ఏకంగా 20-35 స్థానాల వరకు తేడా వచ్చింది. ఒకటి రెండు సర్వేలు అధికార వైసీపీ గెలుస్తున్నట్లు కూడా చెప్పాయి. వాటి గురించి చర్చ అనవసరం.