Take a fresh look at your lifestyle.

కేసీఆర్ ను దేవుడు కూడా కాపాడలేరు : బీజేపీ

0 77

బీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరు

 బీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది

 పరేడ్ గ్రౌండ్ 8న జరిగే బహిరంగ సభను సక్సెస్ చేయండి

 భారీ ఎత్తున జన సమీకరణ చేయండి

– బీజేపీ కార్యకర్తలకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపు

హైదరాబాద్, ఏప్రిల్ 4 (వైడ్ న్యూస్)  తెలంగాణలో బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8న హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేయబోయే బహిరంగ సభను దిగ్విజయవంతం చేయాలని కోరారు.

అందులో భాగంగా భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల నేతలతో జరిగిన సమావేశంలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…

• ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్నారు. తిరుపతికి వందే భారత్ రైలు, ఎయిమ్స్ భవన నిర్మాణంసహా పలు అభివ్రుద్ధి పనులను ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించబోతున్నం.

• ఈ బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ జరపండి. కార్యకర్తలను, ప్రజలను తీసుకొచ్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసుకోండి. కనీవినీ ఎరగని రీతిలో సభను విజయవంతం చేయాలి. వేసవి కాలమైనందు సభ వద్ద తాగునీరు సహా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

• ప్రధాని పర్యటన, పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభపై మీడియా, సోషల్ మీడియాలో విస్త్రత ప్రచారం చేయాలి. హైదరాబాద్ నగరాన్ని పూర్తి స్థాయిలో అలంకరించాలి. మీ మీ డివిజన్లలో పూర్తిస్థాయిలో బహిరంగ సభపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి.

• తెలంగాణ అభివ్రుద్ధికి కేంద్రం అనేక నిధులు కేటాయిస్తోంది. అనేక అభివ్రుద్ధి పనులు చేస్తోంది. 33 జిల్లాలకు గాను 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధించాం. త్వరలో పెద్ద పల్లి జిల్లాలో జాతీయ రహదారిని అనుసంధించే కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. వాటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మనందరిపైనా ఉంది.

• ఒక్క విషయం తెలుసుకోండి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనపట్ల తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. ఇగ ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరు. ఇది నా మాట కాదు… జేపీ నడ్డా గారే చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking