- ‘ధ్రువ్ రాఠీ ఎక్స్పోస్డ్’ పేరుతో వీడియో విడుదల
ఆప్ తో ధ్రువ్ రాఠీకి సంబంధాలు అంటు ఆరోపణ
బీజేపీతో తనకు సంబంధం లేదంటూ స్పష్టం
18వ లోక్ సభ ఎన్నికల వాతావరణం దేశ వ్యాప్తంగా కాకపుట్టింది. వేసవి కంటే ఎన్నిల వేడే ఎక్కువైంది దేశంలో. అయితే ఇంత హీట్ లో కూడా రాజకీయ నాయకుల్ని దాటి ఇద్దరు యూట్యూబర్‌లు హెడ్‌లైన్స్‌లో ఉన్నారు. ఒకరు రాజకీయ అంశాలపై స్టోరీలు చేస్తూ దేశ వ్యాప్తంగా పాపులరాటీ సంబంధించిన ధ్రువ్ రాఠీ కాగా, మరొకరు యూట్యూబ్ సెలెబ్రిటీ ఎల్విష్ యాదవ్.
కొంత కాలంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, బీజేపీకి వ్యతిరేకంగా ధ్రవ్ రాఠీ వీడియోలు చేస్తున్నాడు. అయితే ధ్రువ్ రాఠీకి ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం ఉందని, వాళ్లు ఇచ్చిన కంటెంటునే ధ్రువ్ వీడియోలు చేస్తున్నారని ఎల్విష్ యాదవ్ ఆరోపించాడు. దీనిపై ఇటీవల అతడు చేసిన వీడియో ఒక్క రోజులోనే 80 లక్షల వ్యూస్ సంపాదించింది. అంతే కాకుండా ధ్రువ్ రాఠీ మీద ఎల్విష్ అనేక ఆరోపణలు చేశాడు. దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారని, అతని టెలిగ్రామ్ గ్రూప్ అసభ్యకరమైన కంటెంట్‌ను షేర్ చేసినందుకు నిషేధించబడిందని చెప్పాడు. ధ్రువ్ రాఠీ తన వీడియోలలో క్రిప్టోకరెన్సీ స్కామ్ యాప్‌లను ప్రమోట్ చేసేవాడని, స్కామ్‌లు బహిర్గతం అయినప్పుడు వాటిని ట్రిమ్ చేసేవాడని యాదవ్ ఆరోపించాడు. అయితే ధ్రువ్ ఆప్ మనిషని ఆరోపించిన ఎల్విష్ తనకు మాత్రం బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.
కాగా, ఇంతకుముందు ఎల్విష్ యాదవ్ ఈ వీడియోకు సంబంధించి టీజర్‌లను విడుదల చేశాడు. అందులో ధృవ్ రాతిని ‘జర్మన్ షెపర్డ్’ కుక్కతో పోల్చాడు. తన వ్యక్తిగత, వృత్తి జీవితం గురించి వెల్లడించిన తన బృందంలోని కొంతమంది వ్యక్తులు తనకు తెలుసునని యాదవ్ టీజర్‌లో పేర్కొన్నాడు. అయితే ఎల్విష్ మీద ఇప్పటి వరకు ధ్రువ్ రాఠీ ఎలాంటి వీడియో చేయలేదు. కనీసం సోషల్ మీడియాలోనైనా స్పందించలేదు. దేశవ్యాప్తంగా లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఈ ఇద్దరు యూట్యూబర్ల ఘర్షణ ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపివేస్తోంది.