రక్తదానం చేయడం సామాజిక బాధ్యత
రాయచోటి, నిర్దేశం:
రక్తదానం చేయడం మనందరి సామాజిక బాధ్యత అని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ పేర్కొన్నారు. సోమవారం రాయచోటిలో వివిధ రకాల ముగ్గురు పేషెంట్ లకు రక్తదానం చేశారు.హెల్పింగ్ హాండ్స్ బ్లడ్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో 24×7 రక్తదాన సేవ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం SN కాలనీ కి చెందిన గర్భిణీ స్త్రీకి ఎ+ రక్తము అత్యవసరమని, టౌన్ బోస్ నగర్ ఏరియా కు చెందిన (ఎ+) అలాగే డైయాలసిస్ పేషెంట్ కు (O+) రక్తం అవసరం గాక డాక్టర్స్ పేషెంట్ వారికి తెలియజేయగా వారు సొసైటీ చైర్మన్ వ్యవస్థాపకులు డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ గారిని సంప్రదించగా ఇర్ఫాన్, ఆఫ్ఫాన్, బాబ్జి ముగ్గురీ యువకుల చే శ్రీ దీప బ్లడ్ బ్యాంక్ నందు స్వచందముగా రక్తదానం చేయించారు. అదేవిధంగా సంస్థ చైర్మన్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ గారు మాట్లాడుతూ 18 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు ఉన్న వ్యక్తులు అందరూ రక్తదానం చేయొచ్చని సూచించారు, రక్తదానం చేస్తే నీరసంగా ఉంటారనేది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు.అత్యవసర సమయంలో రక్తదానం చేసిన యువకులుకు పేషెంట్ తరఫున సొసైటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.