Take a fresh look at your lifestyle.

ఎన్నికల తర్వాత EVMల ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది?

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో (EVM) పోలైన ఓట్ల లెక్కింపు ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ (ETPB), పోస్టల్ బ్యాలెట్ (PB) కౌంటింగ్ ప్రారంభమైన అరగంట తర్వాత ప్రారంభమవుతుంది

0 226
  • లెక్కింపులో రౌండ్లు అంటే ఏమిటి?
    లెక్కింపు తర్వాత ఏం జరుగుతుంది?

18వ లోక్‭సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే చాలా మందికి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గురించి అవగాహన ఉండదు. ఓటు వేసిన తర్వాత ఈవీఎంలు ఎక్కడికి వెళ్తాయి? లెక్కింపు ఎలా జరుగుతుందనే విషయం మనం తెలుసుకుందాం.

కౌంటింగ్ ప్రక్రియ ఇలా మొదలు
ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ (ETPB), పోస్టల్ బ్యాలెట్ (PB)ల లెక్కింపుతో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ ఓట్లను రిటర్నింగ్ అధికారి (RO) పర్యవేక్షణలో లెక్కిస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో (EVM) పోలైన ఓట్ల లెక్కింపు ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ (ETPB), పోస్టల్ బ్యాలెట్ (PB) కౌంటింగ్ ప్రారంభమైన అరగంట తర్వాత ప్రారంభమవుతుంది. ‘‘పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాలేదు. మొదటి రౌండ్, రెండవ రౌండ్, మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయింది’’ అని మీరు తరచుగా వినే ఉంటారు. రౌండ్ అంటే 14 ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు. 14 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కించినప్పుడు దానిని ఒక రౌండ్‌గా పరిగణిస్తారు.

ఓట్లు ఎక్కడ లెక్కిస్తారు?
ఎన్నికల అనంతరం నియోజకవర్గంలోని స్ట్రాంగ్‌రూంలో ఈవీఎంలను భద్రపరుస్తారు. ఓట్ల లెక్కింపు జరిగే రోజు ఓట్ల లెక్కింపు కూడా అదే స్ట్రాంగ్ రూంలో జరుగుతుంది. ప్రతి స్ట్రాంగ్ రూంలో రిటర్నింగ్ అధికారి ఉంటారు. కౌంటింగ్ ప్రారంభించే ముందు, అభ్యర్థి లేదా అతని ప్రతినిధి సమక్షంలో EVM ను బయటికి తీస్తారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థి తన కౌంటింగ్ ఏజెంట్, ఎలక్షన్ ఏజెంట్‌తో పాటు హాలులోనే ఉంటారు.

లెక్కింపు తర్వాత..
ఓట్ల లెక్కింపు తర్వాత డేటాను కంట్రోల్ యూనిట్ మెమరీ సిస్టమ్‌లో సేవ్ చేస్తారు. ఈ డేటా తొలగించబడే వరకు నియంత్రణ యూనిట్‌లో ఉంటుంది. ఓట్ల లెక్కింపు బాధ్యత ఎన్నికల అధికారి అంటే రిటర్నింగ్ అధికారి (RO)పై ఉంటుంది. రిటర్నింగ్ అధికారిగా ప్రభుత్వ అధికారి లేదా స్థానిక సంస్థ అధికారిని నియమిస్తారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking