నిర్దేశం, హైదరాబాద్: మీకు సంబంధించిన ఒక రహస్యం మీ వద్ద ఉన్నంత వరకూ ఇది మీకు బానిస, దాన్ని మీరే బయట పెట్టుకున్నారంటే.. పై మీరు దానికి బానిస అనేది పాత వాళ్లు చెప్పిన విషయమే. మనిషి తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని విషయాలను ఇతరులెవ్వరితోనూ, ఆఖరికి ప్రాణ స్నేహితులు అనుకున్న వారితో కానీ, జీవితాన్ని మునుకుంటున్న వారికి అయినా చెప్పుకోకూడదనేది చాణక్యుడితో సహా ఎంతో మంది మేధావులు, తత్వవేత్తలు కూడా చెప్పిన విషయాలే. తరాలు మారినా, కాలం మారినా.. వ్యక్తిగతమైన కొన్ని విషయాల విషయంలో అభద్రతా భావమే పెరుగుతూ ఉంది. కానీ, మానవ తత్వాలు ఏమీ మారడం లేదు. సూటిగా చెప్పాలంటే.. ఈ తరంలో కూడా ఎంత స్నేహితులతోనైనా పంచుకోకూడని విషయాలు చాలానే ఉన్నాయని అంటున్నాయి. అధ్యయనాలు ఎంత క్లోజ్ ఫ్రెండిప్ అయినా, ఎంతటి బంధం అయినా కొన్ని విషయాలను చెప్పుకోకపోవడం ఉత్తముల లక్షణమని, అలా చెప్పుకోని వాళ్లు ఆనందంగా ఉండగలరనేది ఈ అధ్యయనాల సారాంశం. మరి ఈ తరంలో అలా చెప్పుకోకూడని విషయాలు ఏమిటంటే.
పర్సనల్ గోల్స్
చాలా మంది మీ గోల్ ఏమిటి అని అడగ్గానే మేనేజర్ అయిపోవాలని, ఫలానా హెూదాకు చేరుకోవాలని, ఫలానా రీతిలో సెటిల్ అయిపోవాలంటూ.. ఆఫీసుల్లో ఓపెన్ ఫోరం మీదే చెబుతూ ఉంటారు. అలాంటి వారిని చూసి చాలా మంది చేసే పని నవ్వుకోవడం. మీ పర్సనల్ గోల్ వారికి ఏ రకంగానూ విలువైనది కాదు. పైపెచ్చూ మీ గోల్ అలా బాహాటంగా చెప్పడం వల్ల ఆఫీసు పాలిటిక్స్లో కూడా మిమ్మల్ని అడేసుకునే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఆవకాశం వారికి ఉన్నా లేకపోయినా.. పర్సనల్ గోల్స్ గురించి బాహాటంగా చెప్పుకోవడం అనేది ఇమ్యచ్యూర్డ్ వ్యవహారమే తప్ప సుకోటి కారుకి స్నేహితుల వద్ద అయినా, బంధువుల వద్ద కూడా.. ఇలాంటి విషయాల్లో కాస్త గుంభనంగా ఉండటం, పర్సషన్ గోల్స్ గురించి అవి షార్ట్ టర్మ్ ని అయినా, లాంగ్ టర్మ్ అయినా… అతిగా చర్చించకపోవడం మంచిది.
దాంపత్య విషయాలు
సంసారం గుట్టు.. అంటూ పెద్దలు ఏనాడో చెప్పారు. అయితే ఈ రోజుల్లో దాంపత్యం గురించిన పర్సనల్ విషయాలను కూడా చెప్పుకుని అదో ఘనతగా చెప్పుకునే వాళ్లు తయారు అయ్యారు. ఇక మరో కేటగిరి.. తమ దాంపత్యంలోని సమస్యల గురించి అతిగా చెప్పుకునే వారు. అయితే వీటిని బయటకు చెప్పుకోవడం వల్ల అవి మంచివి అయితే ఇతరుల్లో అలసీ, ఇబ్బందుల గురించి అయితే ఇతరుల్లో చిన్నచూపుకు గురి కావడమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే అలా చెప్పుకుంటే కొందరికి ఆనందం, మరి కొందరికి బాధ తగ్గే అవకాశాలు ఉండవచ్చు. అయితే సంసారం గుట్టు అనేది మాత్ర చాలా విలువైన సిద్ధాంతం.
ఆర్థిక విషయాలు
ఈ విషయాల్లో అయితే ఈ రోజుల్లో చాలా మంది జాగ్రత్తగానే ఉంటారు. డబ్బు విషయాలను స్నేహితులు, బంధువులతో చర్చించడానికి అన్నలు ఇష్టపడరు. ఎందుకంటే.. డబ్బుల గురించి చర్చిస్తే.. దుబ్బులు అడుగుతారనే భయాలు అధికం కాండ్లి, ఆర్థిక విషయాలను చాలా మంది రహస్యంగానే ఉంచుతూ ఉంటారు. ప్రత్యేని బాగా సంపాదించే వారి లక్షణం ఇది. ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాడు మాత్రం నగస్తూ ఉంటారు. అయితే చిన్న పాటి ఇబ్బందుల గురించి తెలిసిన వారికి అతిగా చెప్పుకోవడం వల్ల అయ్యేది కూడా లోకువే.
ఆరోగ్య విషయాలు
వ్యాధి రట్టు అనేది పాత సామెతే. అయితే సయాతరంలో ఇదంతా మెరుగైన పద్ధతి కాదనేది అధ్యయనాల సారాంశం. మీకు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య ఉంటే.. వెళ్లి డాక్టర్ను కలవండి. వారు దానికి పరిష్కార మార్గాలు చెబుతారు అంతే కానీ, దాన్ని అందరితోనూ చర్చించడం వల్ల మీరో డిస్కషన్ మెటీరియల్ అవుతారు తప్ప పరిష్కారం దక్కుడు. వ్యాధి కట్టు అనేది వైద్య సేవలు ఇంతలా లేని రోజుల మాట. అప్పుడు వైద్యులు దొరితేదీ కష్టం కాబట్టి.. వారికీ వీరి వెలితే విద్యా వైద్యాలు తెలిసే కాలం అదీ ఇప్పుడు వీధికో డాక్టర్ ఉండగా… ఇక వేరే సలహాలు ఎందుకు.
వ్యక్తిగత సమ్మతాలు
మీ మతం కానీ, మీ నమ్మకాలు కానీ… ఇతరుల్లో చర్చకు పెట్టదగినవి కావు. ఇది కామన్ సెన్స్. మీ నమ్మకాలు మీవి. మీ సిద్ధాంతాలు మీది. మా మతంలో సైన్స్ ఉంది, మా సమ్ముణాల్లో సైద్ధాంతికత ఉంది.. ఇలాంటి మాటలను కొందరు స్నేహితులతోనూ, ఆఫీసుల్లో కూడా చర్చకు పెడుతూ ఉంటారు. ఇదంతా తెగేది కాదు, తెల్లారేది కాదు. వీటి వల్ల మీ మీద ఒక మూర్ఖపు ముద్ర రావడమే తప్ప ఉపయోగం లేదు.