అందరికి డిజిటల్ హెల్త్ కార్డులు

అందరికి డిజిటల్ హెల్త్ కార్డులు
– మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి

హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆధార్‌ కార్డు తరహాలో డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే జులై నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డుల ను ఇస్తామని రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో మంథని వైదిక సంస్థ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్‌బాబుకు సత్కార్‌ సభ జరిగింది. ఈ సభలో కీలక ప్రకటన చేశారు మంత్రి శ్రీధర్‌బాబు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం, ప్రజలు గర్వించేలా పనిచేస్తామన్నారు. ఆధార్‌ నెంబర్‌ తరహాలో ఒక్కో పౌరుడికి స్మార్ట్‌ కార్డు వంటి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డు ఇస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన చికిత్స అందించేందుకు వీలుగా డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డును ప్రత్యేక నంబర్‌తో అనుసంధానం చేయనున్నారు. హెల్త్‌ ప్రొఫైర్‌ కార్డుపై ఉన్న నెంబర్‌ గానీ.. పేరు గానీ ఎంటర్‌ చేయగానే.. ఆ వ్యక్తికి సంబంధించిన వైద్య సేవల వివరాలు తెలుస్తాయన్నారు. దీని వల్ల వారు ఏ వైద్యుడిని సంప్రదించినా.. వారివారి ఆరోగ్య స్థితిగతులను వెంటనే తెలుసుకునే వీలు ఉంటుందని.. మెరుగైన వైద్యసేవలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు శ్రీధర్‌బాబు.ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన సన్మాన సభలో రాజకీయాల్లో ఎలా ఎంట్రీ ఇచ్చారో కూడా చెప్పారు మంత్రి శ్రీధర్‌బాబు. తన తండ్రి శ్రీపాదరావు మరణం తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తనను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. తన తల్లి జయశ్రీ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 25ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించినట్టు చెప్పారాయన. కాంగ్రెస్‌ పార్టీలో సేవలు అందించాలంటే చాలా సహనం ఉండాలని.. మంథని ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం… తనకు గన్‌మెన్‌ను తొలగించినా.. భయపెట్టే ప్రయత్నం చేసినా.. వెనకడుగు వేయలేదన్నారు. హంగూ ఆర్భాటాలకు పోకుండా సాధారణ వ్యక్తిగానే పనిచేశానని చెప్పారాయన. మంత్రి శ్రీధర్‌బాబుకు సత్కార సభ.. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో మంథని వైదిక సంస్థ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్‌బాబుకు సత్కార్‌ సభ జరిగింది. హౌస్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కిషన్‌రావు, వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మాజీ అధ్యక్షుడు వి.నాగభూషణం, నడిపెల్లి వేణుగోపాల్‌రావు, ఇనుగాల భీమారావులు మంత్రికి జ్ఞాపిక అందజేసి సత్కరించారు. సభలో మాజీ ఎంపీ సుగుణకుమారి, వైదిక సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణతోపాటు పలువురు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేల కోసం ఎమ్మెల్యేల క్వార్టర్లలోని డిస్పెన్సరీలతోపాటు అన్ని ఆసుపత్రుల్లో చికిత్సకు అనుగుణంగా మెడిసన్‌ సరఫరా చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యేలు రాజేశంగౌడ్‌, ఆంజనేయులు, సత్యనారాయణగౌడ్‌తోపాటు పలువురు నిన్న (ఆదివారం) మంత్రిని ఆయన ఆఫీసులో కలిశారు. మెడిసిన్‌ సరఫరాలో కొరతను తీర్చాలని కోరారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు వెంటనే స్పందించారు. మెడిసిల్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »