ఢీ’ షో డ్యాన్సర్ కల్యాణి ఆత్మహత్య
ఖమ్మం, నిర్దేశం:
ఢీ’ షో డ్యాన్సర్ కావ్య కల్యాణి(24) ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా పొన్నెకల్లులోని తన ఇంట్లో సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన చావుకు అభి కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనని పెళ్ళి చేసుకొని తనతో కాపురం చేస్తూ ఇప్పుడు మరొ యువతిని పెళ్ళి చేసుకుంటున్నట్లు తెలుసుకుని బలన్మరణానికి పాల్పడింది. 5 ఏళ్లుగా కుటుంబ సభ్యులతో నగరంలోని మామిల్లగూడెం లోని సాయిబాబా గుడి సమీపంలో సహజీవనం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పొన్నేకలు మకాం మాచర్చారు. అభిలాష్ కు మరో అమ్మాయితో పెళ్లికి కుటుంబ సభ్యులు సిద్దం అయ్యారు. విషయం తెలుసుకున్న కల్యాణి పొన్నెకల్ లోని అభి ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో వురి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.