“జై భీమ్” సృష్టికర్త – L. N. హర్ దాస్

“జై భీమ్” సృష్టికర్త – L. N. హర్ దాస్

‘ హర్దాస్ లక్ష్మణ్ రావ్ నగ్రాలే ‘ పేరు ఎక్కువ మందికి తెలియదు. దళితుల అభ్యున్నతికి పాటు పడిన ఒక గొప్ప మహానుభావుడి గురించి తెలియకపోవడం, చరిత్ర పుస్తకాల్లో అతను చేసిన అసామాన్యమైన పనులకు ప్రాచుర్యం లేకపోవడం అత్యంత దుర్మార్గం.

గత కొన్ని దశాబ్దాలుగా దళితులు, కొంతమంది బహుజనులు ఒకరినొకరు పలకరించుకునేందుకు ‘ జై భీమ్ ‘ అని సంబోధించుకోవడం తెలిసిందే. జై భీమ్ అనే రెండు మాటలు దళితుల్లో ఒక గొప్ప పోరాట కాంక్షను, తాము ఒంటరిగా లేమన్న బలమైన ఆత్మగౌరవపు ధైర్యాన్నిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇటీవల వచ్చిన జై భీమ్ సినిమా టైటిల్ పై జరిగిన విస్తృత చర్చ. ఆ టైటిల్ అసంబద్దం అనే కొందరి వాదన చూసాము. అసలు ఆ పదం ఎవరు నేర్పారో చదవండి.

హర్ దాస్ దళితుడు. జనవరి 6, 1904న మహారాష్ట్ర లోని కాంప్టీ గ్రామంలో జన్మించాడు. తండ్రి రైల్వేలో పనిచేసేవాడు. హర్ దాస్, పట్వర్ధన్ హై స్కూల్ నుండి మెట్రిక్యులేషన్ పాస్ అయ్యాడు. చిన్ననాటి నుండే విప్లవ భావాలు ఉన్నవాడు. ఆర్య సమాజ్ లో సంస్కృతం చదివాడు. 17 ఏళ్ళకే కుల వివక్షను నిరసిస్తూ నాగపూర్ నుండి ‘మహారథ’ అనే పత్రిక వెలువరించాడు. 1922 లో ‘ మహార్ సమాజ్ ‘ స్థాపించాడు.


మహార్ సమాజ్ పథక్ పేరుతో వివక్ష పై పోరాటానికి పోలీసింగ్ ఆర్మీ ను తయారు చేసాడు.బీడీ కార్మికుల శ్రమ దోపిడీని అడ్డుకోవాలంటే వాళ్ళకు కో ఆపరేటివ్ సంస్థలు ఉండాలని ప్రతిపాదించాడు. దళిత మహిళలకు తోలు వస్తువుల తయారీలో శిక్షణ ఇప్పించాడు.
హర్ దాస్ అంబేద్కర్ ను 1928 లో కలిశాడు. అంబెడ్కర్ పట్ల అమితమైన గౌరవం కలిగి ఉండేవాడు. హిందువులు ‘ జై రామ్, జై సీతాపతి ‘ అనీ ముస్లింలు ‘ సలేమాలూకూమ్ ‘ అని సంబోధించుకోవడం చూసి దళితుల్లో ఐక్యతను పెంపొందించడానికి ఒకరినొకరు ” జై భీమ్ ” అని పలకరించుకోవాలని సూచించాడు. భీమ్ విజయ్ సంఘ్ అనే సంస్థ కార్మికులు ముందుగా జై భీమ్ అనుకునేవాళ్ళు. తర్వాత జై భీమ్ అనేది మహోన్నత నినాదమైంది. భీమ్ అంటే జ్ఞానం. చీకటి నుండి వెలుతురు వైపు అని హర్ దాస్ నిర్వచించాడు..దళితుల కోసం నిరుపేదల కోసం హర్ దాస్ చెయ్యని పోరాటం లేదు.

మూఢనమ్మకాలను, కులవివక్ష ను, విగ్రహారాధన నూ నిరసిస్తూ ‘ చోఖ మేళా ‘ పేరుతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయించాడు.హర్ దాస్ ,దళితులకు విద్య యొక్క ప్రాముఖ్యత ను తెలియజేయాలని నైట్ స్కూళ్ళు తెరిచాడు.

గాంధీ -అంబెడ్కర్ మధ్య జరిగిన పూనా ఒప్పందం పై సంతకం చేసాడు.బ్రిటన్ ప్రధాని రామ్ సే మేక్ డోనాల్డ్ కు ‘ దళితులకు అంబెడ్కర్ ‘ అసలైన నాయకుడు గాంధీ కాదు అని ఉత్తరం రాశాడు.32 మంది దళిత నాయకులకు టెలిగ్రామ్ లు ఇచ్చాడు.మండల్ మహాత్మా అనే పుస్తకం రాసాడు.’ జన్తా ‘ వారపత్రికకి వ్యాసాలు రాసేవాడు.. ఆ వ్యాసాలను స్వయంగా అంబెడ్కర్ ఎడిటింగ్ చేసేవారు.

హర్ దాస్ 1937 లో కాంప్టే నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అభ్యర్థి గా అసెంబ్లీ కి ఎన్నికైన తొలి దళితుడు.రాజకీయాల్లో నిమ్న కులాలకు ప్రాతినిధ్యం కోసం ఎంతో పోరాడాడు.1939, జనవరి 12 న టీబీ బారిన పడి మృతిచెందాడు.ఇంత గొప్ప మహానుభావుడి చరితను మరుగుపర్చారు.

2016 లో బాలీవుడ్ దర్శకుడు సుబోధ్ నాగ్ దేవ్ తీసిన ” బోలే ఇండియా జై భీమ్ ” అనే సినిమాలో హర్ దాస్ జీవితాన్ని చిత్రించాడు. హర్ దాస్ పోరాట జీవితాన్ని, దళితుల కోసం అతని నిరంతర కృషిని కప్పిపుచ్చాలని చూసినా అతను నేర్పిన” జై భీమ్” నినాదం కోట్ల మందిలో స్ఫూర్తి మంత్రమై మ్రోగుతుంది.

జై భీమ్.

సేకరణ : రజిత కొమ్ము

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!