Take a fresh look at your lifestyle.

ట్రాన్స్ జెండర్లకు కార్పొరేట్ వైద్యం : మంత్రి కొప్పుల

0 69

ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

:మంత్రి కొప్పుల ఈశ్వర్ 

హైదరాబాద్, ఏప్రిల్ 4 (వైడ్ న్యూస్) అన్నీ వర్గాల మాదిరిగానే ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టు బడి ఉందని రాష్ట్ర ఎస్సి అభివృద్ధి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం వారం నిర్వహించిన ట్రాన్స్ ఉత్సవం కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. వీరికి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కార్పొరేట్ హాస్పిటల్ ల్స్ లోను ఉచితంగా వైద్య సేవలు అందించేలా ముఖ్య మంత్రి కేసీఆర్ చొరవ చూపారని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మన రాష్ట్రం లో సుమారు 58,918 గుర్తించిన్నట్లు మంత్రి వెల్లడించారు.

ట్రాన్స్ జెండర్ పర్సన్స్ హక్కుల రక్షణ కై రూపొందిన నియమాలను, 2020 29 సెప్టెంబర్, 2020న గెజిట్ లో ప్రచురించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 400 మంది ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. మొదటి సారిగా ట్రాన్స్ ఉత్సవం జరుపు కోవడం ఎంతో అభినందనియమన్నారు.

.రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి 19 మంది సభ్యులతో రాష్ట్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయబదినట్టు చెప్పారు. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రతీ జిల్లా కేంద్రల్లోను హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.

ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటుందని.. ఇందుకోసం అందరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, వికలాంగుల సంస్థ ఉన్నతాది కారులు భారతి హాలికేరి, దివ్యదేవారజన్, శైలజ పలువురు ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking