బ్రిడ్జిపై నుంచి పడిపోయిన కంటైనర్ లారీ
కడప , నిర్దేశం:
డ్రైవర్ నిద్రమత్తులో వుండడంతో కంటైనర్ లారీ అదుపుతప్పి గోటూరు బ్రిడ్జి పైనుంచి కిందకి పడిపోయింది. మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన కంటైనర్ లారీ చెన్నై నుంచి బాంబేకి వెళ్తుండగా ల్లా వల్లూరు మండల పరిధిలోని గోటూరు గ్రామం జాతీయ రహదారిలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో.. బ్రిడ్జిపై నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5:30 కి అదుపుతప్పి కింద పడడం జరిగింది. కంటైనర్ లారీలో డ్రైవర్ శివానంద సంజయ్(28), క్లీనర్ సంతోష్ లు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న వల్లూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్వల్ప గాయాలైన డ్రైవర్, క్లీనర్ ను 108 అంబులెన్స్ ద్వారా కడప రిమ్స్ కు తరలించి విచారణ చేపట్టారు..