ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అవకాశం పోగొట్టుకున్న కాంగ్రెస్
ప్రజా సేవ చేసిన బీసి వ్యక్తికి దక్కని కాంగ్రెస్ టిక్కెట్…
చొప్పదండి, నిర్దేశం:
గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అవకాశం కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయం వల్ల పోగొట్టుకుందని పలువురు విమర్శిస్తున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఆదిలాబాద్, జిల్లాలో జరిగిన గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులకు, విద్యార్థులకు లక్షలాది రూపాయలు విలువచేసే జాబ్ కాంపిటీషన్స్ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు ఎంతోమంది పేద ప్రజలకు సేవచేసిన త్యాగమూర్తి తన ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలి పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసి అభ్యర్థిగా పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణ గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తే తప్పకుండా గెలిచే వాడని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పుడు నిర్ణయం వల్ల బీజేపికి లాభదాయకంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొరకు అహర్నిశలు కృషి చేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గౌడ్ ను కాదని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయింపులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తన వర్గం బలోపేతానికి పాటుపడుతున్నాడని బీసి సామాజిక వర్గానికి సహకరించడం లేదని బీసి వర్గాలలో చర్చనీయాంశం అవుతోంది. ప్రజలతో సత్సంబంధాలు లేకపోయినా పార్టీ కొరకు పాటు పడకపోయినప్పటికి కేవలం డబ్బులు ఉన్నాయనే దృక్పథంతో టిక్కెట్ ఇచ్చారని గెలిచే అవకాశం ఉన్న ఎమ్మెల్సీ సీటు కోల్పోయారని వాదనలు వినిపిస్తున్నాయి..ఏది ఏమైనా బీసిలు ఐకమత్యంగా ఉంటే డబ్బులకు అమ్ముడు పోకుండా ఉంటే ప్రసన్న హరికృష్ణ గౌడ్ విజయం సాధించేవాడని కొందరు బీసి మేధావులు అంటున్నారు. ఇరువురి మధ్య పోరులో బీజేపీ గెలవడంతో రాష్ట్రంలో బీజేపీకి మరింత జోష్ వచ్చింది..