ఇంగ్లాండ్ తో సిరీస్ కైవసం…
అశ్విన్ రికార్డుల మోత
నిర్దేశం, రాంచీ :
రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి వుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. లక్ష్య సాధనలో ఇంగ్లాండ్ స్పిన్నర్ బషీర్ కాస్త కంగారు పెట్టినా తొలి ఇన్నింగ్స్ హీరో జురెల్ గిల్ భారత్ ను విజయ తీరాలకు చేర్చారు. ఆరంభంలో సారధి రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ భారత్ కు బలమైన పునాది వేశారు. కానీ బషీర్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో ఉత్కంఠ రేగింది. కానీ గిల్… జురెల్ మిగితా పనిని ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి చేశారు. రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 145 పరుగులే ఆలౌట్ అయింది. టీమిండియా స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ వికెట్ల పతనం వేగంగా సాగింది. దీంతో టీమిండియా ముందు 192 పరుగుల లక్ష్యం నిలిచింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లతో బ్యాటర్లను కట్టిపడేశాడు.