ఒరిస్సాలో డ్రోన్ పోతే.. నార్సింగ్ పోలీసు స్టేషన్ లో సివిల్ పంచాయితీ

సైబరాబాద్ కమిషనరెేట్ లో

సివిల్ పంచాయితీల జోరు..

  • ఒరిస్సాలో డ్రోన్ పోతే.. నార్సింగ్ పోలీసు స్టేషన్ లో  సివిల్ పంచాయితీ
  • కెపిహెచ్ పి పోలీసు స్టేషన్ లో భార్య – భర్తల పంచాయితీ
  • మియాపూర్ పోలీసు స్టేషన్ లో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్సై

చట్టం అందరికి సమానమే.. ఆ చట్టం దాటి ఎవరు పని చేసినా శిక్ష తప్పదని పోలీసు ఉన్నతాధికారుల హెచ్చరికలు.. అయినా.. డబ్బులకు కక్కుర్తి పడి పోలీసు స్టేషన్ లను సివిల్ పంచాయితీలకు కేంద్రంగా మార్చుతున్నారు కొందరు పోలీసు అధికారులు. సైబరాబాద్ పోలీసు కమీషనర్ అవినాష్ మహంతి పేరు చెబితేనే నిజాయితీకి మరో పేరు. అతని తండ్రి మాజీ డీజీపీ మహంతిని స్పూర్తిగా తీసుకుని నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తారు అతను. అయినా.. అవినీతికి అలవాటు పడ్డ కొందరు పోలీసు అధికారులు  సివిల్ పంచాయితీల పేరిట అక్రమంగా లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.

నిర్దేశం, హైదరాబాద్ :

సైబరాబాద్ పోలీసు కమీషనర్ అవినాష్ మహంతి.. నిజాయితీకి మారు పేరు.. నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తారనే పేరుంది. అయితే.. తప్పు చేసినోళ్లను చట్ట పరిధిలో శిక్షించాల్సిన పోలీసు అధికారులే తప్పు చేస్తే..? నిజమే.. సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ లో జరిగిన సంఘటలు తాజా ఉదాహరణగా చెప్పొచ్చు.

ఒరిస్సాలో దొంగతనం..

నార్సింగ్ పోలీసు స్టేషన్ లో పంచాయితీ

అన్యాయం జరిగిందని పోలీసు స్టేషన్ కు వెళ్లితే తమ పరిధి కాదని చెప్పడానికి వీలు లేదు. జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ కు స్పెషల్ మెస్సెంజర్ ద్వారా పంపించాలి. అక్కడి పోలీసు అధికారులు స్పాట్ లో ఏమి జరిగిందో తెలుసుకుని దర్యాప్తు చేస్తారు. కానీ.. ఒరిస్సాలో ద్రోన్ వ్యవహరంలో నార్సింగ్ పోలీసు స్టేషన్ లో పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది. ద్రోన్ ను అద్దెకు తీసుకుని ఒరిస్సాకు వెళ్లిన ఒకరు దానిని పోగొట్టుకున్నారు. బ్యాటరీ వీక్ కావడంతో ద్రోన్ ఎక్కడో పడి పోయింది. ఆ ద్రోన్ కోసం వెతికినా దొరుకలేదు.

అయితే..  ఒరిస్సాలో ద్రోన్ పోతే  నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఏమిటో ఎవరికి అర్థం కాని సమస్య. వాస్తవానికి ఓ పోలీసు అధికారితో ఉన్న సంబందాలతో ద్రోన్ యజమాని తప్పుడు ఫిర్యాదు చేసి ద్రోన్ రికవరి కోసం పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది. సదరు పోలీసు అధికారి తన లిమిట్ ను దాటి ద్రోన్ పోగొట్టుకున్న వ్యక్తిని అదుపులోకి రోజంతా పోలీసు స్టేషన్ లో కూర్చుండ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. సైబరాబాద్ పోలీసు కమీషనర్ అవినాష్ మహంతి సివిల్ పంచాయితీల పేరుతో అవినీతికి పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంటే మరో దిక్కు ఇలా నార్సింగ్ పోలీసు స్టేషన్ ను సివిల్ పంచాయితీలకు నిలయంగా మార్చడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

 

కేపీహెచ్ పీ పోలీసు స్టేషన్ లో భార్య భర్తల పంచాయితీ

విచారణకు ఆదేశం..

కేపీహెచ్ పీ పోలీసు స్టేషన్ సివిల్ పంచాయితీలకు నిలయంగా మారడం పట్ల సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సీరియస్ గా ఉన్నారు. బాధితుడు బ్యాంక్ మేనేజర్ ప్రణీత్  కథనం ప్రకారం.. భార్య భర్తల మనస్పర్థాల వివాదంపై ఫిర్యాదు వస్తే రాజీ కోసం చాలా సార్లు సిట్టింగ్ చేసి వారి మధ్య మనస్పర్థాలను తొలగించడానికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ముఖ్యంగా సివిల్ పంచాయితీలను పోలీసులు పట్టించుకోవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా ఉన్నాయి.

అయితే.. హైదరాబాద్ నిజాంపేట్ లో ఉంటున్న హెచ్ డిఎఫ్ సీ బ్యాంక్ మేనేజర్ ప్రణీత్ పై భార్య శ్రీలక్ష్మీ ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారులు ప్రణీత్ ను చితుక బాది వెంటనే భార్యతో పంచాయితీని పరిష్కారం చేసుకోవాలని, ఆమె సర్టిఫికెట్ లు తిరిగి ఇవ్వాలని హెచ్చరించినట్లు బాధితుడు ప్రణీత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ ఆదేశాలతో బాలానగర్ అదనపు డీసీపీ సత్యనారాయణ మంగళవారం కెపిహెచ్ పి పోలీసు స్టేషన్ వెళ్లి ఎస్సై, కానిస్టేబుళ్లను విచారించారు. కాగా సీఐ వెంకటేశ్వర్లు సెలవులో ఉన్నారు. అయితే.. ఒక ఎస్సై పాత్ర ఎక్కువగా ఉన్నట్లు విచారణలో తేలినట్లు తెలిసింది.

మియాపూర్ ఎస్పై మహిళతో అసభ్య ప్రవర్తన..

అన్యాయం జరిగిందని మియాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఓ మహిళతో అసభ్యకరంగా వ్వవహరించిన ఎస్సైపై సైబరాబాద్ పోలీసు కమీషనర్ అవినాష్ మహంతి సిరియస్ అయ్యారు. ప్రాథమిక విచారణ తరువాత ఎస్సై గిరిష్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు. బ్యూటిషియన్ గా పని చేస్తున్న ఓ మహిళ చీటింగ్ కేసులో ఒకరిపై ఫిర్యాదు చేసింది. ఆ కేసును విచారించిన ఎస్సై గిరిష్ నిందితుడుని అరెస్టు చేసారు. అంతటితో ఆ సమస్య పరిష్కారమైంది. అయితే.. ఆ బ్యూటిషియన్ సెల్ కు ఫోన్ లు చేసి అసభ్యకరంగా మాట్లాడేవారని సైబరాబాద్ పోలీసు కమీషనర్ అవినాష్ కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంతే.. విచారణ జరిపిన సీపీ మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేశారు.

(14న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ సీసీ అవినీతి భాగోతం స్టోరీ)

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!