లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ..
నిర్దేశం, నారాయణపేట :
నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. రూ.20 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా సీఐ చంద్రశేఖర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సీఐతో పాటు కానిస్టేబుళ్లు శివరెడ్డి, నరసింహ కూడా అవినీతి కేసులో ఇరుక్కున్నట్లు సమాచారం!