తెలంగాణలో క్యాస్ట్ పాలిటిక్స్

తెలంగాణలో క్యాస్ట్ పాలిటిక్స్

హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కులగణన తర్వాత క్యాస్ట్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. ఓవైపు బీసీ నినాదం తెరపైకి రాగా.. మరోవైపు మున్నూరు కాపు నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు హాజరవ్వడం గమనార్హం.కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఇంట్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మున్నూరు కాపు నేతలు సమావేశమయ్యారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. తీర్మానం చేశారు. అటు నామినేటెడ్ పోస్టుల్లోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కులగణనపై పలు సందేహాలు ఉన్నాయని.. ప్రతి గ్రామంలో కులగణన వివరాలు ప్రభుత్వం ప్రదర్శించాలని డిమాండ్ చేశారుమున్నూరు కాపుల జనాభాను ప్రభుత్వం తక్కువ చేసి చూపెట్టిందని నేతలు అభిప్రాయపడ్డారు. అందుకు ప్రత్యేకంగా కులం తరుపున సర్వే కమిటీ వేసుకున్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్‌ను కో ఆపరేటివ్ సొసైటి లాగా తుతూ మంత్రంగా ఏర్పాటు చేశారని.. పూర్తి స్థాయి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఛైర్మన్‌ను నియమించాలని నిర్ణయించారు.మున్నూరు కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కనీసం 20వేల మందికి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. కోకాపేటలో గత ప్రభుత్వం 5 ఎకరాల భూమిని మున్నూరు కాపు భవన నిర్మాణం కోసం ఇచ్చింది. అక్కడ భూమి ఉన్న నేపథ్యంలో దాన్ని సమంతరం చేసి భవన నిర్మాణం చేసుకునేందుకు వీలుగా.. నిధులు పెంచాలని నేతలు కోరారు.మున్నూరు కాపు భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. తాజా రాజకీయాలపై చర్చించి.. పార్టీలకు అతీతంగా సంఘటితంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు.. మున్నూరు కాపుల ప్రాతినిధ్యం లేకుండా ఏ మంత్రివర్గం లేదని.. కచ్చితంగా మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.మున్నూరు కాపులకు కోకాపేట్‌లో ఇచ్చిన ఆత్మగౌరవ భవన నిర్మాణానికి తగిన ప్రాధ్యానత ఇస్తూనే, 10 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు నేతలు.  మున్నూరు కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కనీసం 20వేల మందికి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని తీర్మానించారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న కాచిగూడ మున్నూరు కాపు సంఘ భవనాన్ని తిరిగి ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు.హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. తమ సత్తా ఏంటో చూపించాలని నేతలందరూ తీర్మానం చేశారు. ఆ సభకు ఛైర్మన్ వీహెచ్, సలహదారుడిగా కేకే వ్యవహరించనున్నట్లు సమాచారం. దీనికితోడు ఉమ్మడి ఏపీలో తమ కమ్యూనిటీకి మంత్రి పదవి ఉండదేని, ఈ ప్రభుత్వంలోనూ అవకాశం ఇవ్వాలని నేతలంతా ప్రభుత్వాన్ని కోరనున్నారు.విప్ ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వాలన్నది నేతల డిమాండ్. ఆపై ఓ తీర్మానం కూడా చేశారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నది మరొక డిమాండ్. ప్రత్యేకంగా కులం తరపున సర్వే కమిటీ వేసినట్టు తెలుస్తోంది. మున్నూరు కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఛైర్మన్‌ను నియమించాలన్నది కొందరు నేతల మాట. తాజా రాజకీయాలపై చర్చించిన వివిధ పార్టీల నేతలు, పార్టీలకు అతీతంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు.దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న కాచిగూడ మున్నూరు కాపు సంఘ భవనాన్ని.. ప్రభుత్వం కులానికే తిరిగి ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. మున్నూరు కాపు భారీ బహిరంగ సభ నిర్వహణ కోసం మళ్లీ భేటీ కావాలని నేతలు నిర్ణయించారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ పైనా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసి నిర్ణయం తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమైంది. రాజకీయ కుట్రలను ఛేదిస్తూ.. సంఘటితంగా కలిసి పనిచేయాలని నేతలు చర్చించుకున్నారు.మున్నూరు కాపు నేతల సమావేశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఓరకంగా ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారనే చర్చ జరుగుతోంది. తమ సామాజికవర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »